విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 19-01-2026గా నిర్ణయించారు.

నోటిఫికేషన్ 16 డిసెంబర్ 2025న విడుదలైంది. 19 జనవరి 2026 దరఖాస్తుల ముగింపు తేదీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (క్లాస్-I) 3 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జీతం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, విశాఖ పోర్ట్ అథారిటీ ప్రకారం పే స్కేల్ రూ. 50,000–1,60,000 వరకు ఉంటుంది. డిప్యుటేషన్ సమయంలో డియర్‌నెస్ అలవెన్స్, స్థానిక అలవెన్సులు, నివాస వసతి ఛార్జీలు, ఇతర ప్రయోజనాలు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నియమాలు, డిప్యుటేషన్ నిబంధనల ప్రకారం ఉంటాయి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు, పారిశ్రామిక/వాణిజ్య/ప్రభుత్వ సంస్థలో పోర్ట్, మెరైన్ నిర్మాణాలలో ప్లానింగ్/కన్స్ట్రక్షన్/డిజైన్/మెయింటెనెన్స్‌లో ఐదు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ కేడర్ అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధనల ప్రకారం 35 సంవత్సరాలు, సడలింపు కూడా ఉంటుంది.
దరఖాస్తుతో పాటు గత 5 సంవత్సరాల ACRలు/APARల ఫార్వర్డ్ సర్టిఫైడ్ కాపీలు, విద్యా, అనుభవ ధృవపత్రాల ధృవీకరించి కాపీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌తోపారు మరికొన్ని పత్రాలు పంపాలి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తుదారు నుండి ముందస్తు దరఖాస్తు కాపీ అంగీకరించరని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నిర్ణీత తేదీలోపు పంపిన దరఖాస్తులు మాత్రమే పరిగణిస్తారు. అసంపూర్ణ దరఖాస్తులు, చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులు లేదా ACRలు/APARలు లేదా అవసరమైన పత్రాలు లేకుండా వచ్చిన దరఖాస్తులు పరిగణించరు.
కవరుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుకు దరఖాస్తు అని రాసి.. కార్యదర్శి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, 1వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనం, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం – 530035కు పంపాలి.
{{/usCountry}}కవరుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుకు దరఖాస్తు అని రాసి.. కార్యదర్శి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, 1వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనం, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం – 530035కు పంపాలి.
{{/usCountry}}ఈ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి