వైజాగ్ పోర్ట్‌లో ఉద్యోగాలు.. మంచి జీతం.. జనవరి 19 అప్లికేషన్ లాస్ట్ డేట్!

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Published on: Dec 22, 2025, 15:04:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 03 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 19-01-2026గా నిర్ణయించారు.

వైజాగ్ పోర్టులో ఉద్యోగాలు
వైజాగ్ పోర్టులో ఉద్యోగాలు

నోటిఫికేషన్ 16 డిసెంబర్ 2025న విడుదలైంది. 19 జనవరి 2026 దరఖాస్తుల ముగింపు తేదీగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) (క్లాస్-I) 3 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. జీతం సివిల్ ఇంజనీరింగ్ విభాగం, విశాఖ పోర్ట్ అథారిటీ ప్రకారం పే స్కేల్ రూ. 50,000–1,60,000 వరకు ఉంటుంది. డిప్యుటేషన్ సమయంలో డియర్‌నెస్ అలవెన్స్, స్థానిక అలవెన్సులు, నివాస వసతి ఛార్జీలు, ఇతర ప్రయోజనాలు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నియమాలు, డిప్యుటేషన్ నిబంధనల ప్రకారం ఉంటాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు, పారిశ్రామిక/వాణిజ్య/ప్రభుత్వ సంస్థలో పోర్ట్, మెరైన్ నిర్మాణాలలో ప్లానింగ్/కన్స్ట్రక్షన్/డిజైన్/మెయింటెనెన్స్‌లో ఐదు సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ కేడర్ అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధనల ప్రకారం 35 సంవత్సరాలు, సడలింపు కూడా ఉంటుంది.

దరఖాస్తుతో పాటు గత 5 సంవత్సరాల ACRలు/APARల ఫార్వర్డ్ సర్టిఫైడ్ కాపీలు, విద్యా, అనుభవ ధృవపత్రాల ధృవీకరించి కాపీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌తోపారు మరికొన్ని పత్రాలు పంపాలి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.

దరఖాస్తుదారు నుండి ముందస్తు దరఖాస్తు కాపీ అంగీకరించరని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నిర్ణీత తేదీలోపు పంపిన దరఖాస్తులు మాత్రమే పరిగణిస్తారు. అసంపూర్ణ దరఖాస్తులు, చివరి తేదీ తర్వాత అందిన దరఖాస్తులు లేదా ACRలు/APARలు లేదా అవసరమైన పత్రాలు లేకుండా వచ్చిన దరఖాస్తులు పరిగణించరు.

కవరుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుకు దరఖాస్తు అని రాసి.. కార్యదర్శి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, 1వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనం, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం – 530035కు పంపాలి.

ఈ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్‌ చదవండి

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More