విశాఖ జిల్లాలో తెల్లవారుజామున భూప్రకంపనలు.. అక్కడ భూకంప కేంద్రం!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో భూకంపం సంభవించింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. విశాఖపట్నం, సింహాచలంలో భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా విశాఖ వాసులు ఎక్కువగా భూకంపం చూశారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

ఈ సమయంలో శబ్ధం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖపట్టణంలోని పలు ప్రాంతాల్లో.. అరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందూర్తిలో తెల్లవారుజామున 4:19 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద శబ్ధంతో భీమిలి బీచ్ రోడ్డులో భూమి కంపించింది.
మరోవైపు సింహాచలంలోనూ.. భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ కంపం వచ్చిన సమయంలో పెద్ద శబ్ధాలు వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపించేసరికి.. విశాఖవాసులు కలవరపడ్డారు. ఇళ్లలోని సామాన్లు కింద పడినట్టుగా వెళ్లడించారు. ఈ స్వల్ప భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. జి.మాడుగులలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కొన్ని రోజుల కిందట గుంటూరు, ప్రకాశంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అదే సమయంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ తేలికపాటి భూకంపం సంభవించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


