'అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్' ముఠా గుట్టురట్టు - వెలుగులోకి కీలక విషయాలు
కాంబోడియా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న డిజిటల్ అరెస్ట్ ముఠాను భీమవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి పోయిన డబ్బులో పెద్ద మొత్తాన్ని రికవరీ చేసి రికార్డు సృష్టించారు.
'డిజిటల్ అరెస్ట్'… గత కొంతకాలంగా ఈ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా… చాలా మంది సైబర్ మోసగాళ్ల వలలో చికిపోతున్నారు. వేల నుంచి లక్ష రూపాయల వరకు ఈజీగా కొట్టేస్తున్నారు. ఇందుకోసం అనేక రకాల పేర్లు వాడేస్తున్నారు. ఇదే మాదిరిగా కాంబోడియా దేశాన్ని అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఓ ముఠా దందా సాగిస్తోంది. ఈ సైబర్ నేరాల ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు.

భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు మాట్లాడుతూ తాము సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని పరిచయం చేసుకున్నారు. సిమ్ కార్డులో తేడాలున్నాయని అని చెబుతూ నమ్మబలికారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయాందోళనకు గురి చేశారు. దీంతో టెన్షన్ కు గురైన సదరు వ్యక్తి…. అతని బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలను చెప్పాడు. ఏకంగా 78 లక్షల రూపాయలను తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. మోసపోయానని గ్రహించిన అతను… భీమవరం పోలీసులను ఆశ్రయించాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ మాట్లాడుతూ… నవంబర్ 17న బెంగళూరు పోలీసు అధికారులుగా నటించిన స్కామర్లు చేసిన వాట్సాప్ కాల్స్ ద్వారా ఈ మోసం జరిగిందని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.78.6 లక్షలు వారి ఖాతాలోకి మళ్లించుకున్నారని పేర్కొన్నారు.
భీమవరం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడగా…. నిందితుల కోసం వేట ప్రారంభించారు. నిందితులు కార్డ్ డీల్ అనే కొత్త పద్ధతి ద్వారా నగదును మళ్లించినట్లు గుర్తించారు. ఈ ముఠాకు కాంబోడియా దేశంతో లింకులు ఉన్నట్లు తేలింది. మొత్తం 14 మందిని నిందితులుగా గుర్తించగా…. వీరిని గన్నవరం, విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేశారు. రూ.42 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సిమ్ కార్డులు, బ్యాంకు పత్రాలు, పాస్ పోర్ట్లు, టెలిగ్రామ్ ఆధారిత డిజిటల్ సాక్ష్యాలతో కూడిన 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముంబైకి చెందిన రహతే జె నయన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

