పవన్ కల్యాణ్ చొరవతో అడవి లోపల ఉండే గూడెం గ్రామంలో ఫస్ట్ టైమ్ విద్యుత్ కాంతులు!

అడవి లోపల ఉండే గూడెం గ్రామానికి మెుదటిసారిగా విద్యుత్ కాంతులు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో గిరిజనుల దశబ్దాల నాటి కల సాకారమైంది.

Published on: Nov 6, 2025, 06:42:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్వాతంత్య్రంవచ్చిన తర్వాత మొదటిసారిగా విద్యుత్ కాంతులను చూసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోంపల్లి గ్రామ పంచాయతీలోని గూడెం అనే మారుమూల గిరిజన కుగ్రామం. బుధవారం విద్యుత్ లైట్లతో మెరిసిపోయింది. ఈ కొండ ప్రాంతంలో నివసించే 17 కుటుంబాలు ఇన్ని రోజులు చీకటిలోనే ఉన్నారు. ఐదు నెలల క్రితం గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించి విద్యుదీకరణ ప్రాజెక్టును వేగవంతం అయ్యేలా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

గూడెంలో విద్యుత్ కాంతులు
గూడెంలో విద్యుత్ కాంతులు

కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి విద్యుత్ అధికారులు కొండపై ఉన్న గ్రామానికి విద్యుత్ లైన్లను తీసుకెళ్లారు. దాదాపు 9.6 కిలోమీటర్ల దూరం లైన్ వేస్తూ.. 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 17 ఇళ్లకు ఒక్కొక్కరికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ను అందించింది. అనంతగిరి మండల ప్రధాన కార్యాలయం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఏఎస్ఆర్ జిల్లాలోని దట్టమైన అడవులలో ఉన్న గూడెం దశాబ్దాలుగా ఆధునిక ప్రపంచం నుండి దాదాపుగా తెగిపోయింది. గ్రామస్తులకు రోడ్లు, సురక్షితమైన తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవు.

సంవత్సరాలుగా అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి వెంటనే అధికారులను ఆదేశించారు. ఈ విద్యుదీకరణ ప్రాజెక్టుకు అనేక సవాళ్లు ఉన్నాయి. కొండలు, రాతి భూభాగాలలో 9.6 కిలోమీటర్ల దూరం విద్యుత్ స్తంభాలను వేయాల్సి వచ్చింది. కార్మికులే స్తంభాలను మోసుకెళ్లారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాతి కొండలను తవ్వడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఖర్చు రూ.80 లక్షలకు పైగా ఉంది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా, అధికారులు 17 ఇళ్లలోనూ విద్యుత్తును ప్రారంభించారు. కృతజ్ఞతాపూర్వకంగా, నివాసితులు తమ జీవితాలను మార్చిన పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎం జనమాన్ పథకం కింద సౌరశక్తి, పవన టర్బైన్‌లను కలిపి హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More