...
...
Next Story

Macherla Rape Case : మంచి నీళ్ల కోసం తలుపు తట్టి...! మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం!

Macherla Rape Case : పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం వెలుగు చూసింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Published on: Apr 4, 2026, 17:22:54 IST
Advertisement

పల్నాడు జిల్లాలోని మాచర్లలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన ఓ వ్యక్తి… మహిళపై అత్యాచారం చేశాడు. దాహమని నీళ్లడిగి మెడపై కత్తిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలిసింది. భాదిత మహిళ… ప్రభుత్వ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.

మంచినీళ్ల కోసం వచ్చి…

ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం (Representational image)
ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం (Representational image)

పోలీసుల వివరాల ప్రకారం…. ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2న సాయంత్రం 4 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మంచి నీళ్ల కారణంతో తలుపు తట్టాడు. తరువాత అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు.

సదరు మహిళ తన భర్త నుంచి విడిపోయిన ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఓ కుమార్తె ఉండగా… అమ్మమ్మ వాళ్లతో కలిసి ఉంటుందని తెలిసింది. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

అత్యాచారం చేసిన వ్యక్తి కోసం అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) నేతృత్వంలోని బృందాలు అన్వేషిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు ఆరా - పోలీసులకు ఆదేశాలు:

మాచర్ల పట్టణంలో వెలుగు చూసిన ఈ రేప్ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. త్వరితగతిన నిందితుణ్ని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ఇందుకు సీఎం స్పందిస్తూ…. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks