విశాఖపట్నం : దొంగ, పోలీస్‌ ఆట అని నమ్మించి...! అత్తను పెట్రోల్ పోసి హత్య చేసిన కోడలు

విశాఖ జిల్లాలోని పెందుర్తిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దొంగా పోలీస్‌ ఆటంటూ అత్తపై కోడలు పెట్రోల్‌ పోసి హత్య చేసింది. కుర్చీకి కట్టడంతో పాటు కళ్లకు గంతలు కట్టి ఈ దారుణానికి పాల్పడింది.

Published on: Nov 9, 2025, 06:32:25 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తన అత్త సూటిపోటి మాటలతో వేధిస్తోందని భావించిన ఓ కోడలు ఆమెను భౌతికంగా లేకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి పక్కాగా ఓ ప్లాన్ రచించింది. దొంగా పోలీస్‌ ఆటంటూ అత్తపై కోడలు పెట్రోల్‌ పోసి హత్య చేసింది. పైగా ఏం తెలియనట్లు నటించే ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ… పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటికి వచ్చాయి.

అత్తకు నిప్పు పెట్టిన కోడలు (representative image )
అత్తకు నిప్పు పెట్టిన కోడలు (representative image )

విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు శనివారం నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు వివరాలను ఏసీపీ పృథ్వీతేజ, సీఐ సతీశ్‌కుమార్‌ వెల్లడించారు. పెందుర్తి మండలం వేపగుంట అప్పన్నపాలెంలోని ఓ అపార్ట్ మెంట్ లో సుబ్రహ్మణ్యం, లలితాదేవి (30) దంపతులు ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కమారుడు ఉన్నాడు. వీరితో పాటే అత్త అయిన కనకమహాలక్ష్మి(63) నివాసం ఉంటోంది.

భర్త సుబ్రహ్మణ్యం శుక్రవారం రాత్రి పని మీదపై బయటకు వెళ్లాడు. ఆ వెంటనే అతని ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. మీ తల్లి మృతి చెందగా…. కుమార్తె శ్రీనయన(08) గాయపడిందని చెప్పారు. అతనికి ఇంటికి చేరుకోగా… పోలీసులకు కూడా సమాచారం అందింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పలు కోణాల్లో విచారించగా…. ఫ్లాట్‌లో పెట్రోల్‌ వాసన రావడాన్ని పోలీసులు గమనించారు. హత్య కోణంలో అనుమానం బలపడింది.కోడలిని ప్రాథమికంగా విచారించారు. ఆమె మొబైల్ ను పరిశీలించగా…. యూట్యూబ్‌లో చూసిన వీడియోలు బయపడ్డాయి. వాటిల్లో హత్య చేసి ఏమార్చడం ఎలా? అన్న వీడియోలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

భార్య లలితాదేవి తీరుపై అనుమానాలు బలపడటంతో ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. సూటిపోటి మాటలతో వేధిస్తుండడంతో తానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది.

దొంగ పోలీస్ ఆట అంటూ….!

అత్తను చంపాలని ప్లాన్ చేసుకున్న కోడలు లలితాదేవి ఎవరూ ఊహించని విధంగా హత్య పథకాన్ని రచించింది. ముందగానే పెట్రోలు కొనుగోలు చేసి ఇంటిలో దాచింది. శుక్రవారం తన భర్త బయటకు వెళ్లగానే పిల్లలతో దొంగ, పోలీస్‌ ఆడాలని అత్తకు చెప్పి సహకరించాలని కోరింది.

ఆటలో భాగంగా పిల్లలు వేరే గదిలో దాకున్నారు. కుర్చీలో కూర్చుని ఉన్న అత్త కళ్లకు చున్నీతో గంతలు కటేసింది. ఆ తరువాత కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసింది. దాచి ఉంచిన పెట్రోల్‌ను అత్తపై పోసి నిప్పంటించింది. క్షణాల్లో మంటలు వ్యాపించటంతో…. కనకమహాలక్ష్మి సజీవ దహనమైంది.

నానమ్మ అరుపులు విని వెంటనే బయటకు వచ్చిన శ్రీనయన మంటలు అంటుకుని స్వల్పంగా గాయపడింది. ఈ ఘోరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కోడలు లలితాదేవి డ్రామా షురూ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చి అగ్నిప్రమాదం సంభవించిందని గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. టీవీ పేలి పెద్దశబ్దం వచ్చిందని చెప్పుకొచ్చింది. అందరూ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందని భావించారు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటికి రావటంతో కోడలు లలితాదేవిని అరెస్టు చేశారు.మరోవైపు కూతురు శ్రీనయన కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More