...
...
Next Story

వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం.. బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్!

కృష్ణా జిల్లాలోని మెుంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్‌కి ప్రమాద జరిగింది.

Published on: Nov 4, 2025, 14:00:30 IST
Advertisement

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మెుంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. జగన్ కాన్వాయ్ నియోజకవర్గంలోకి రాగానే వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. దీంతో ప్రమాద జరిగింది. అయితే పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

కృష్ణా జిల్లా జగన్ పర్యటన
కృష్ణా జిల్లా జగన్ పర్యటన

పర్యటనకు ముందే పలు నిబంధలను విధించారు పోలీసులు. వీటిని వైసీపీ శ్రేణులు ఉల్లంఘించాయి. డీజే ఏర్పాటు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు తీయించారు. కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పెనమలూరు, పెడన, పామర్రు, మచిలిపట్నం నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా జగన్ వచ్చారు. అయితే వైఎస్ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పర్యటించాలని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌ల మీద వస్తున్న యువతను కూడా అడ్డుకున్నారు.

పర్యటనలో భాగంగా తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్‌కు రైతులు చూపించారు. తమకు జరిగిన నష్టం గురించి జగన్‌కు వినతిపత్రాలు అందించారు.

వైఎస్ జగన్‌ను జనం నుంచి దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. జనాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. జగన్‌ను పోలీసు ఆంక్షలు, నిర్బంధాలతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయనకు జనంలో ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాల్లో ఒక్కరు కూడా రైతులకు జరిగిన నష్టాన్ని వచ్చి చూడలేదని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe