...
...
Next Story

డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ రాజీనామా చేయాలి - వైఎస్ జగన్ డిమాండ్

YS Jagan Demands Nara Lokesh Resignation : డీఎస్సీ నిర్వహణలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

Published on: Jul 26, 2026, 12:54:11 IST
Advertisement

YS Jagan Demands Nara Lokesh Resignation : రాష్ట్రంలో డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని జగన్ గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వంలో ఇది నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపిన ఆ నైతిక ప్రమాణాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందో లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

రాజీనామాపై లోకేశ్ కు వైఎస్ జగన్ ప్రశ్న…

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులు డీఎస్సీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతమంది అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ డీఎస్సీ నిర్వహణలో అంతులేని అక్రమాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా..? అని నిలదీశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైఖరిని కూడా వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ విలువలు, ప్రమాణాలు మరియు జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ…. సీఎం చంద్రబాబు తన కుమారుడి పదవిని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారా అని ప్రశ్నించారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని… ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks