రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ దుయ్యబట్టారు. ఈ 18 నెలల కాలంలో ఎవరికైనా సంతృప్తి ఉందా…? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
వైఎస్ జగన్ ప్రశ్నలు…

“చంద్రబాబు గారు….. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా… మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా..?” అని వైఎస్ జగన్ నిలదీశారు. ట్వీట్ లో నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఉద్యోగుల హామీల అంశాలను ప్రస్తావించారు.
“నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000, 50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4 వేలు, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట" ఏమైందని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
“ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ఏటా రూ.15,000, ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు” ఏమైయ్యాయని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? అని ప్రశ్నించారు.
“మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పేశారు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా..?” అని జగన్ ఆక్షేపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంటింటికీ డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా 30 పథకాలు వెలిగాయని గుర్తు చేశారు. ఆ దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు… ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ దుయ్యబట్టారు.
{{/usCountry}}“మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పేశారు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా..?” అని జగన్ ఆక్షేపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇంటింటికీ డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా 30 పథకాలు వెలిగాయని గుర్తు చేశారు. ఆ దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు… ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ దుయ్యబట్టారు.
{{/usCountry}}