వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
వైసీపీ నేత, ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.

గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్ లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స…. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అంతకుముందు… 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా.. చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ… మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో… ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

