రెండు చుక్కల వీర్యం ఇచ్చి పెద్ద తోపు అనుకుంటారు అన్న యాంకర్- ఆమని రిప్లై ఇదే!
సీనియర్ హీరోయిన్ ఆమని 90స్ కాలంలో ఎన్నో ఫ్యామిలీ చిత్రాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవలే తెలుగు చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమని నారి సినిమా చేశారు. మార్చిలో రిలీజ్ అయిన నారి సినిమా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు హీరోయిన్ ఆమని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.
అలనాటి తెలుగు స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. 90స్ కాలంలోని సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించిన ఆమని మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌తోపాటు యూత్‌ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమనిచేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు.
రెండు చుక్కల వీర్యం ఇచ్చి పెద్ద తోపు అనుకుంటారు.. యాంకర్ కామెంట్స్.. మగవాళ్లకు ఏముండదు అన్న సీనియర్ హీరోయిన్ ఆమని
నారి సినిమా ప్రమోషన్స్
స్టార్ హీరోయిన్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆమని ఇటీవల కాలంలోనే కీలక పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమని చేసిన సినిమా నారి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఆమని పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. సమాజాంలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలు, వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఆడవాళ్లను చులకనగా చూడటం వంటి అంశాల గురించి యాంకర్, ఆమని మాట్లాడుకున్నారు.
ఒక స్టేజ్ వరకు
ఈ క్రమంలోనే "కొడుకు చేసిన తప్పులను కచ్చితంగా సరిదిద్దాలి సింగిల్ పేరెంట్‌గా" అని యాంకర్ అన్నారు. "ఒక స్టేజ్ వరకు అయితే సరిదిద్దుతాం. లిమిట్స్ దాటిపోయే చేస్తే దానికి సరైన న్యాయం చేస్తుంది.. అమ్మ" అని ఆమని చెప్పారు. "ఎందుకంటే ఆమె ధర్మం వైపు నిలుచుంటుంది. స్త్రీకి తెలిసినంత ధర్మం ఎవరికి తెలియదు" అని యాంకర్ అన్నారు.
"ఆ ధర్మమే నారి సినిమాలో కాపాడుతది. అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది సూర్య (డైరెక్టర్) గారు బాగా చూపించారు సినిమాలో" అని ఆమని చెప్పారు.
పవర్‌ఫుల్ డైలాగ్ విన్నా
"బ్యాక్ ఎండ్‌లో మాట్లాడుకుంటుంటే ఇంకోటి చాలా పవర్‌ఫుల్ డైలాగ్ విన్నాను నేను.. జస్ట్ రెండు చుక్కల వీర్యం అంటే స్పెర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తురుమ్ ఖాన్‌లా ఫీల్ అయిపోయి నాకు బిడ్డ పుట్టాడు.. బిడ్డ పుట్టాడు.. అని బయట చెప్పేసుకుంటారు. మరి నవ మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు అలాగే నెలసరి" అని యాంకర్ చెబుతుంటే.. మధ్యలో ఆమని మాట్లాడారు.
"కష్టాలన్నీ ఆడవాళ్లకేనండి. మగవాళ్లకు ఏముండదు. జెన్స్‌కేముండదు. ఉమెన్‌కే అన్ని కష్టాలు. పుట్టినప్పటి నుంచి కష్టాలన్ని అమ్మాయికే. మగాడు 16 ఏళ్లకు అలాగే ఉంటాడు, 30 ఏళ్లు అయినా అలాగే ఉంటాడు" అని ఆమని అభిప్రాయ పడ్డారు.
పిచ్చి చూపులు చూస్తే
"16 ఏళ్లకు అబ్బాయి అమ్మాయిని పిచ్చి చూపులు చూస్తే హార్మోనల్ బ్యాలెన్స్ అంటారు. అదే అమ్మాయి పక్కింటి అబ్బాయిని చూస్తే కాళ్లు విరగ్గొడతారు" అని యాంకర్ అన్నారు. ఇలా ఆడవాళ్ల సమస్యలు అంటూ యాంకర్, ఆమని తమ అభిప్రాయలు చెప్పుకున్నారు.