ఓటీటీలోకి మూడు వారాల్లోనే నాలుగు భాషల్లో వస్తున్న తెలుగు రొమాంటిక్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి ఓ తెలుగు రొమాంటిక్ మూవీ మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు వస్తోంది. గత నెల 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ మూడు వారాల్లో స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ లోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (జులై 7) వెల్లడించింది. ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కానుంది. జూన్ 20న థియేటర్లలో రిలీజైన ఈ 8 వసంతాలు సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు.

8 వసంతాలు ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు. పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన సినిమాగా రిలీజ్ కు ముందే మంచి బజ్ నెలకొంది. అయితే అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు వారాల్లోనే అంటే వచ్చే శుక్రవారం (జులై 11) నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
తెలుగు సహా మొత్తం 4 భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “8 వసంతాలు.. తను ప్రేమించింది. ఓడిపోయింది.. ఎదిగింది.. జులై 11 నుంచి 8 వసంతాలు మీ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
8 వసంతాలు మూవీ గురించి..
8 వసంతాలు మూవీని ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేశాడు. ఇందులో మ్యాడ్ మూవీతో పాపులర్ అయిన నటి అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డిలాంటి వాళ్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శుద్ధి అయోధ్య (అనంతిక) అనే అమ్మాయి, ఆమె ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఓ యువ రచయిత్రి. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు.
అలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వరుణ్ (హను రెడ్డి) అనే అబ్బాయి వెంట పడతాడు. అయితే తర్వాత అతడు ఆమెను వదిలేసి అమెరికాకు వెళ్లిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు సంజయ్ (రవి దుగ్గిరాల) అనే మరో వ్యక్తి పరిచయమవుతాడు. ప్రేమలో విఫలమైన శుద్ధి జీవితం ఆ తర్వాత ఏమవుతుంది? ఆమె తన కెరీర్లో ఎలా ఎదిగింది అన్నదే ఈ 8 వసంతాలు మూవీ కథ. ఇప్పుడీ సినిమా జులై 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి థియేటర్లలో మిస్ అయి ఉంటే ఓటీటీలో చూసేయండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



