ఓటీటీలోకి నేరుగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3.. షార్ట్ ఫిల్మ్‌కు సీక్వెల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్ కానుంది తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆ గ్యాంగ్ రేపు 3. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి సూపర్ హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ఆ గ్యాంగ్ రేపు మూవీకి సీక్వెల్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Published on: Jul 13, 2025, 11:07:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3. తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ తెరకెక్కింది.

ఓటీటీలోకి నేరుగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3.. షార్ట్ ఫిల్మ్‌కు సీక్వెల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నేరుగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆ గ్యాంగ్ రేపు 3.. షార్ట్ ఫిల్మ్‌కు సీక్వెల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విమర్శకుల ప్రశంసలు

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిది 'ఆ గ్యాంగ్‌ రేపు'. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన ఆ గ్యాంగ్ రేపు మూవీకి సీక్వెల్గా 'ఆ గ్యాంగ్‌ రేపు-2' షార్ట్‌ ఫిల్మ్‌ కూడా వచ్చింది.

ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇదే టీమ్ నుంచి రాబోతున్న మరో సెన్సేషనల్‌ క్రైమ్ థ్రిల్లర్ 'ఆ గ్యాంగ్‌ రేపు-3'. ఆ గ్యాంగ్ రేపు షార్ట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు.

తొలి ఫీచర్ ఫిల్మ్‌ ఓటీటీలో

ఇంతకు ముందు యోగీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఆ గ్యాంగ్‌ రేపు-3 ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు యోగీ కుమార్.

ఆ గ్యాంగ్ రేపు 3 సినిమాలో నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్గా ఉండనున్నాయి.

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్

కథన వేగం, మూడ్‌ను కచ్చితంగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు కట్ ఈ సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది. 2017లో మొదటి సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు, కన్నడ హిట్ షుగర్ ఫ్యాక్టరీకి సంగీతం అందించిన కబీర్ రఫీ ఆ గ్యాంగ్ రేపు సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

రీసెంట్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్లో ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించలేదు. డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ కానున్న ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ ట్రైలర్‌ను జులై 16న విడుదల చేయనున్నారు.

కాగా, ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌‌తోపాటు సందీప్‌ సాండిలియా, దయానంద్‌ రెడ్డి, మహిపాల్‌ తదితరులు నటిస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More