మ్యాట్రిమోనీల పేరుతో మోసాలు.. మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ మూవీ.. థియేటర్లలో రిలీజైన 13 నెలల తర్వాత
మంచి అమ్మాయిలతో పెళ్లిల్లు చేస్తాం.. వివాహం కోసం ఎదురు చూస్తున్న అబ్బాయిల నిరీక్షణకు ముగింపు పలుకుతాం.. అంటూ మ్యాట్రిమోనీల పేరుతో జరుగుతున్న మోసాలను చూపించిన తెలుగు కామెడీ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేయండి.
అల్లరి నరేష్ కామెడీ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన 13 నెలల తర్వాత మరో ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజే (జూన్ 12) రెండో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టింది. మ్యాట్రిమోనీల పేరుతో జరిగే మోసాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా అందించారు.

ఎక్కడంటే?
అల్లరి నరేష్ మూవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ గురువారం మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో 2024 మే 3న ఈ సినిమా రిలీజైంది. అదే నెల 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన 13 నెలల తర్వాత మరో ఓటీటీ ఈటీవీ విన్ లో అడుగుపెట్టింది.
థియేటర్లలో ఇలా
అల్లరి నరేష్ మూవీ అంటే మినిమం కామెడీ గ్యారెంటీ. ఇటీవల కాలంలో డిఫరెంట్ స్టోరీస్ మూవీస్ చేస్తున్న అతను.. తిరిగి కామెడీని నమ్ముకుని చేసిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. అల్లరి నరేష్ తో ఫరియా అబ్దుల్లా జత కట్టడంతో మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలో మాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి సంపాదించలేదు. డిజాస్టర్ గా నిలిచిపోయింది.
కథ ఏమిటంటే?
గణ (అల్లరి నరేష్)కు పెళ్లి చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటాడు. ఇంట్లో పెళ్లి చేసుకోవాలని తల్లి బలవంతం చేస్తోంది. తన అనారోగ్యం కారణంతో 25 రోజుల్లో వివాహం చేసుకోవాల్సిందేనని షరతు విధిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాట్రిమోనీని సంప్రదిస్తాడు అల్లరి నరేష్. అక్కడ అమ్మాయిల ఫొటోలను చూపిస్తారు. అలా సిద్ధి (ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. ఆమెనే పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటాడు హీరో.
ఆ మోసంతో
మరోవైపు మ్యాట్రిమోనీల పేరుతో ఓ వైపు మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మాయిలతో మాట్లాడిస్తూ డబ్బులు గుంజుతుంటారు. గణను పెళ్లి చేసుకునేందుకు సిద్ది నిరాకరిస్తూనే ఉంటోంది. ఆమె కూడా మ్యాట్రీమోనీలోనే పని చేస్తుందనే విషయం తర్వాత తెలుస్తుంది. మరి అల్లరి నరేష్ పెళ్లి జరిగిందా? మ్యాట్రిమోనీల మోసాలను ఎలా బయటపెట్టారు? అన్నదే కథ.
ఈ సినిమాలో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాతో పాటు వెన్నెల కిశోర్, హర్ష చెముడు, హరి తేజ తదితరులు నటించారు. ఈ సినిమాకు మల్లి అంకం డైరెక్టర్. మ్యాట్రిమోనీ ఎలా మోసాలు చేస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తూ కామెడీగా సాగే ఈ సినిమాను ఓ సారి చూసేయండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



