నార్త్ అమెరికా తెలుగు సొసైటీలో ఆది సాయి కుమార్ హారర్ థ్రిల్లర్ శంభాల టీజర్ రిలీజ్.. అల్లు అర్జున్, సమంత, శ్రీలీల, సందడి!
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 2025 ఈవెంట్‌లో ఆది సాయి కుమార్ నటించిన హారర్ థ్రిల్లర్ శంభాల టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, సమంత, శ్రీలీల, సుకుమార్, థమన్ వంటి స్టార్స్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శంభాల టీజర్ రిలీజ్ చేయడంతో మూవీ హాట్ టాపిక్‌గా మారింది.
యంగ్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ శంభాల టీజర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే.

మేకింగ్ వీడియో
శంబాల టీమ్ వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, మేకింగ్ వీడియో ఇలా అన్నీ కూడా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాయి. ఇక తాజాగా నిర్వహించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో ‘శంబాల’ టీజర్ హాట్ టాపిక్‌గా మారింది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 2025
విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ‘శంబాల’ టీజర్‌ను ప్రదర్శించారు.
థమన్‌తో శంభాల టీజర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల వంటి టాప్ స్టార్లు హాజరై సందడి చేసిన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది. శంబాల టీజర్‌ను సంగీత దర్శకుడు ఎస్ థమన్ లైవ్ కచేరీలో ప్లే చేశారు. ఆయన అద్భుతమైన ప్రదర్శన వేదికను అలరించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు
ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథ మహరథుల నుంచి శంభాల టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ మూవీని ఓ విజువల్ వండర్‌గా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండేలా నిర్మిస్తున్నారు.
శంభాల నటీనటులు
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి వారు నటించారు.
శ్రీచరణ్ పాకాల బీజీఎమ్
శంభాల మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్ కె. బంగారి అద్భుతమైన విజువల్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. శంభాల టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



