ఆ సినిమా కోసం రోజుకు 100 పాన్‌లు తినేవాడిని.. నోట్లో పొక్కులు వచ్చాయి.. చాలా కష్టం భరించాను: ఆమిర్ ఖాన్

ఓ సినిమా కోసం ఓ స్టార్ హీరో రోజు 100 పాన్‌లు (కిళ్లీలు) తిన్నాడంటే నమ్మగలరా? అది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ కే సాధ్యం. సినిమాలోని పాత్ర కోసం అతడు ఎంతటి రిస్ట్ అయినా తీసుకుంటాడు అనడానికి ఇది నిదర్శనం.

Published on: Nov 4, 2025, 18:35:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ను ఎప్పుడైనా పాన్ నములుతూ చూశారా? మీరే కాదు ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ ఒకానొక సమయంలో అతడు ఏకంగా రోజుకు వంద పాన్లు నమిలేవాడట. అయితే అది అంత వ్యసనంలా మారిపోయిందా అని అనుకోకండి. ఓ సినిమాలో తాను పోషించిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ఆమిర్ ఈ పని చేశాడట. ఇది 2014లో విడుదలైన 'పీకే' సినిమా షూటింగ్‌లో కావడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఆ సినిమా కోసం రోజుకు 100 పాన్‌లు తినేవాడిని.. నోట్లో పొక్కులు వచ్చాయి.. చాలా కష్టం భరించాను: ఆమిర్ ఖాన్
ఆ సినిమా కోసం రోజుకు 100 పాన్‌లు తినేవాడిని.. నోట్లో పొక్కులు వచ్చాయి.. చాలా కష్టం భరించాను: ఆమిర్ ఖాన్

రోజుకు వంద పాన్లు.. కారణం ఇదే

'పీకే' సినిమాలో ఆమిర్ ఖాన్ గ్రహాంతరవాసి (ఏలియన్) పాత్ర పోషించాడు. ఒక లక్ష్యంతో భూమి పైకి వచ్చిన అతడు.. అనుకోకుండా ఇక్కడే చిక్కుకుపోతాడు. తన అసాధారణ శక్తులతో భూమిపై మనుషుల భాష, వారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు నేర్చుకుంటాడు.

ఈ క్రమంలో సినిమాలో అతని పాత్ర నిరంతరం పాన్ నములుతూ కనిపిస్తుంది. అందుకే షూటింగ్ సమయంలో ఆమిర్ ఖాన్ ప్రతిరోజూ పాన్ నములుతూనే ఉండేవాడట. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

పెదవులు ఎర్రగా కనిపించేందుకు..

"నేను రోజుకు 100 పాన్ల వరకు నమిలేవాడిని" అని ఆమిర్ ఖాన్ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. అతని కోసం షూటింగ్ సెట్‌లో ఒక పాన్‌వాలా (పాన్ తయారుచేసే వ్యక్తి) ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడట.

ఆమిర్ ఖాన్ తన పాత్రలో నిజమైన అనుభూతి తీసుకురావడానికి అలా చేసేవాడు. పాన్ నమలడం వల్ల అతని పెదవులు సహజంగా ఎర్రగా కనిపించేవి. అంతేకాదు పాన్ నములుతున్నప్పుడు వచ్చే ఆ సహజమైన ఉచ్చారణ (యాస) కూడా ఆ పాత్రకు చాలా అవసరం. అందుకే అంత కష్టమైనా అతడు రోజంతా పాన్ తింటూనే ఉండేవాడు.

అయితే ఈ పర్ఫెక్షనిజం వల్ల అతడు పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నిరంతరం పాన్ నమలడం వల్ల ఆమిర్ ఖాన్‌కు నోటిలో పొక్కులు వచ్చాయట. దీంతో అతడు చాలా బాధపడ్డాడు. "పాత్రలో నిజాయితీ కోసమే ఆ కష్టం భరించాను" అని అతడు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో ఆమిర్‌తో పాటు ఉన్న కో-స్టార్ అనుష్క శర్మ సైతం.. ఆమిర్ ఖాన్ రోజంతా ఇష్టమున్నా, లేకపోయినా పాన్లు తినడం చూసి చాలా బాధేసేది అని చెప్పింది.

'పీకే' సినిమా బడ్జెట్, వసూళ్లు

ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ కలిసి నటించిన ఈ 'పీకే' సినిమా దాదాపు రూ. 85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం దేశీయంగా రూ. 122 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఆమిర్ పర్ఫెక్షనిజం, రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వ ప్రతిభకు ఇది నిదర్శనం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More