డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న బాలీవుడ్ రొొమాంటిక్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్విస్ట్ లతో సాగే లవ్ స్టోరీ

బాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ సినిమా లో ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల జోడీని ఎంటర్ టైనింగ్ గా చూపించనున్నారు. ఆ మూవీ ఏంటో? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.  

Published on: Jun 17, 2025, 11:43:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అనే భాషాభేధాలు ఉండవు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మూవీ అయినా ఓటీటీలో మిగతా భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ కారణంగా ఇతర భాషల సినిమాలనూ తెలుగులో మన ఆడియన్స్ చూసేస్తున్నారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ వస్తున్న ఆ మూవీ పేరు ‘ఆప్ జైసా కోయి’. రొమాంటిక్ కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రాబోతోంది.

ఓటీటీలోకి బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ (x/NetflixIndia)
ఓటీటీలోకి బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ (x/NetflixIndia)

డైరెక్ట్ ఓటీటీలోకి

బాలీవుడ్ మూవీ ‘ఆప్ జైసా కోయి’ నేరుగాఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ గా ఇది డిజిటల్ బాట పడుతోంది. ఈ ఆప్ జైసా కోయి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్‌ మంగళవారం (జూన్ 17) అనౌన్స్ చేసింది. జులై 11 నుంచి ఈ మూవీ ఓటీటీలోస్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్‌ సోషల్ మీడియాలో ప్రకటించింది.

అయిదు భాషల్లో

ఆప్ జైసా కోయి సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలోకి రానుంది. ఒరిజినల్ హిందీ లాంగ్వేజ్ లో ఉన్నప్పటికీ ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో మాధవన్, ఫాతిమా సనా షేక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి వివేక్ సోని డైరెక్టర్. కరణ్ జోహార్ తో పాటు సోమెన్ మిశ్రా, అపూర్వ మెహ్తా ప్రొడ్యూసర్లు.

ఇద్దరి రొమాంటిక్ కథ

రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఆప్ జైసా కోయి తెరకెక్కింది. హాయిగా చూసేలా, మనసుకు హత్తుకునేలా ఈ మూవీని వివేక్ సోని రెడీ చేశారు. రెండు వేర్వేరు ప్రపంచాలు కలిగిన ఓ ఆడ, మగ కలిసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్లు సాగించే జీవితమే ఈ సినిమా. శ్రీరేణు (ఫాతిమా) ఏమో సంప్రదాయబద్ధంగా జీవించే అమ్మాయి. మధు బోస్ (మాధవన్) ఏమో సారీ చెప్పేందుకు ఇష్టపడని అబ్బాయి. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్, లవ్, కోపాలు, ఆధిపత్యం కలగలిపిన స్టోరీనే ఈ సినిమా.

ఈ దంపతుల ప్రయాణంలో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తోంది. గుండెను బరువెక్కించే సన్నివేశాలకూ కొదవ ఉండదని టాక్. ఇక కామెడీకి ఎలాంటి లోటు లేదు. ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియో చూస్తేనే అది అర్థమవుతుంది. మంచి ఫీల్ ఉన్న రొమాంటిక్ కామెడీ మూవీ చూడాలనుకునే వాళ్లకు ఆప్ జైసా కోయి నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More