సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి.. 5 సినిమాల్లో హీరో, 170 ముఖ్య పాత్రలు.. సీనియర్ నటుడు చిట్టి అసలు పేరు ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు సీనియర్ నటుడు చిట్టి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో మంచి పాత్ర చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 5 సినిమాల్లో హీరోగా కూడా చేసిన నటుడు చిట్టి అసలు పేరు ఏంటీ అనేది ఆయన చెప్పుకొచ్చారు.

Jul 17, 2025, 06:29:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారు. కానీ, వారికి ఆశించినంత స్థాయిలో సరైన గుర్తింపు దక్కలేదు. వారు ప్రతి సినిమాల్లో ఏదో ఒక పాత్రతో అలరిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు చిట్టి ఒకరు.

సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి.. 5 సినిమాల్లో హీరో, 170 ముఖ్య పాత్రలు.. సీనియర్ నటుడు చిట్టి అసలు పేరు ఇదే!
సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి.. 5 సినిమాల్లో హీరో, 170 ముఖ్య పాత్రలు.. సీనియర్ నటుడు చిట్టి అసలు పేరు ఇదే!

40 ఏళ్లు పూర్తి

ఎందరో హీరోలతో కలిసి ముఖ్య పాత్రలు పోషించిన నటుడు చిట్టి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న చిట్టి ఈ సందర్భంగా ఆయన అసలు పేరు, చేసిన పాత్రల గురించి తెలిపారు.

తల్లిదండ్రులు పెట్టిన పేరు

టాలీవుడ్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నటుడు చిట్టి మాట్లాడుతూ.. "నేను కళామ్మతల్లి కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అందరూ నన్ను చిట్టి.. చిట్టి అనడంతో నా స్రీన్ నేమ్ చిట్టిగా మారింది. కానీ, నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం చందన లక్ష్మీ నరసింహారావు" అని అన్నారు.

"చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుండి ఆనాటి డైరెక్టర్స్ నుండి ఈ రోజు దర్శకుల వరకు అందరితో నేను పని చేసాను. నాకు పాత్రలు రాసిన రైటర్స్‌కి, పాత్రలు ఇచ్చిన డైరెక్టర్స్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు" అని చిట్టి తెలిపారు.

హీరోగా ఐదు సినిమాల్లో

"పరిశ్రమలో ఉన్న హీరోలు అందరితో కలిసి వెండితెరని పంచుకోవడం నా అదృష్టం. ఇప్పటి వరకు 5 సినిమాల్లో హీరోగా చేసాను, 170 సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించాను. కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‌లో అలా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించిన నేను నేటికి 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు పొందడం చాలా సంతోషంగా ఉంది" అని నటుడు చిట్టి వెల్లడించారు.

"పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, మాస్టర్, గౌతమ్ SSC, ఠాగూర్, రణం, ఇష్క్, పోకిరి, క్రాక్, లెజెండ్, అఖండ, సరిలేరు నీకెవ్వరూ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా నేను నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి" అని చిట్టి పేర్కొన్నారు.

చిరంజీవి సినిమాలో

"ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి సినిమాలో మంచి పాత్రలో నటించాను. కొత్త తరం పరిశ్రమకి రావాలి, కొత్త ఆలోచనలతో , కొత్త కథలతో ఎన్నో సినిమాలు రావాలి. చిత్ర పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి" అని చిట్టి కోరుకున్నారు.

"అలానే కొత్త, పాత దర్శకులకి మా లాంటి సీనియర్ నటుల సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. మరొకసారి ఇప్పటి వరకు నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, దర్శకులకి, హీరోలకి ప్రత్యేక ధన్యవాదాలు" అని నటుడు చిట్టి తన మనసులోని భావాలను బయటపెట్టారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More