నటుడిగా 50 ఏళ్లు అవుతోంది.. మా టైమ్‌లో ఇలా చేసేవాళ్లం కాదు.. మోహన్ బాబు కామెంట్స్
మంచు విష్ణు నటించిన లేటెస్ట్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా వ్యవహరించిన కన్నప్ప జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 28న కన్నప్ప థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కామెంట్స్ చూస్తే..!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప. తెలుగులో మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.

కన్నప్ప థ్యాంక్స్ మీట్
ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 28న కన్నప్ప థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. "ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైమ్‌లో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని అన్నారు.
తిరిగి ఏం ఇవ్వగలను
"కన్నప్ప సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు" అని మోహన్ బాబు తెలిపారు.
"ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే.. కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు" అని నిర్మాత, నటుడు మోహన్ బాబు చెప్పారు.
ఇదంతా శివలీల
మంచు విష్ణు మాట్లాడుతూ .. "మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్" అని చెప్పుకొచ్చారు.
"మోహన్ బాబు గారి ఫ్యామిలీతో నాకు ఎంతో మంచి సంబంధం ఉంది. కన్నప్ప చిత్రం అద్భుతం చేసింది. ఇంతటి ప్రేమను కన్నప్ప దక్కించుకుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. విష్ణు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తరతరాలు నిలిచిపోయే సినిమా అవుతుంది" అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి తెలిపారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



