నాకు శ్రీకాకుళం యాస తెలియదు.. జార్జిరెడ్డి చూసి అతని ఫ్యాన్ అయిపోయాను.. నటుడు నరేంద్ర రవి కామెంట్స్

హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో నటుడు నరేంద్ర రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Nov 10, 2025, 10:54:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. 7 పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

నాకు శ్రీకాకుళం యాస తెలియదు.. జార్జిరెడ్డి చూసి అతని ఫ్యాన్ అయిపోయాను.. నటుడు నరేంద్ర రవి కామెంట్స్
నాకు శ్రీకాకుళం యాస తెలియదు.. జార్జిరెడ్డి చూసి అతని ఫ్యాన్ అయిపోయాను.. నటుడు నరేంద్ర రవి కామెంట్స్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో బ్లాక్ బస్టర్ ఫన్ షో అంటూ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు నరేంద్ర రవి, నటి యామిని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చింది. నాకు శ్రీకాకుళం యాస తెలీదు. కానీ రాహుల్ అన్న మాత్రం దగ్గరుండి నాకు ఈ యాసను నేర్పించారు. సినిమా మీద ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించడం లేదు" అని అన్నారు.

జార్జిరెడ్డి చూసిన తరువాత

"తిరువీర్ అన్న ఈ మూవీని భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించారు. ‘జార్జిరెడ్డి’ చూసిన తరువాత తిరువీర్ అన్నకి ఫ్యాన్ అయిపోయాను. రాహుల్ అన్న నన్ను యాక్టర్‌గా నిలబెట్టారు. సురేష్ అన్న మ్యూజిక్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. మా చిత్రాన్ని చూడని వారు త్వరగా చూడండి. అందరినీ ఆకట్టుకుంటుంది" అని యాక్టర్ నరేంద్ర రవి చెప్పారు.

నటి యామిని మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మాకోసం వచ్చిన బీవీఎస్ రవి సర్‌కి థాంక్స్. ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డాను" అని తెలిపారు.

మంచి రివ్యూలు

"ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చాలా బాగా వచ్చింది. మీడియా కూడా మంచి రివ్యూలు ఇచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా చూడని వాళ్లంతా కూడా మా మూవీని చూడండి" అని వెల్లడించారు నటి యామిని.

నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారు. మీడియా వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకు రీచ్ అయింది. టీఎఫ్‌జేఏకి నా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నన్ను నిలబెట్టిన మీడియాకు థాంక్స్" అని అన్నారు.

మంచి చిత్రాన్ని నిర్మించావని

"ఈ మూవీనే నన్ను నిర్మాతగా మార్చింది. ఇదంతా కూడా రాహుల్ వల్లే జరిగింది. మంచి చిత్రాన్ని నిర్మించావని నా సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులంతా మెచ్చుకుంటున్నారు" అని ప్రొడ్యూసర్ సందీప్ అగరం తెలిపారు.

"ఈ మూవీని వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన తిరువీర్ అన్నకి థాంక్స్. ఆడియెన్స్ మా సినిమా చూసి మంచి లాభాల్ని అందిస్తే మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాను" అని ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రొడ్యూసర్ సందీప్ అగరం పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More