...
...
Next Story

హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్

టాలీవుడ్‌లో యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శివాజీ రాజా. పర్వతనేని రాంబాబు నిర్మాతగా నిర్మిస్తున్న వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా వైల్డ్ బ్రీత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Published on: Jun 14, 2025, 10:35:52 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్‌టైన్ మెంట్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్‌ను తాజాగా ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

వైల్డ్ బ్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్
హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్

వైల్డ్ బ్రీత్ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

పాత్రికేయుల సమక్షంలో

ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రారంభం నుంచి

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - "నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు నిర్మాతగా వైల్డ్ బ్రీత్ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది" అని అన్నారు.

నిర్మాతగా ఎన్నో చిత్రాలు

"ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా" అని శివాజీ రాజా తెలిపారు.

కథ బాగుంటే

ఇదే ఈవెంట్‌లో నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. "పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజున ఈ వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

బీఏ రాజులా

"మన మీడియా ఫ్రెండ్స్‌లో బీఏ రాజు గారు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాంబాబు కూడా అలాగే ప్రొడ్యూసర్‌గా ఎదగాలి. దర్శకుడు హరినాథ్ పులి చిన్నవాడు. అలాగే ఒదిగి ఉండి కష్టపడితే తప్పకుండా పైకి వస్తాడు. వైల్డ్ బ్రీత్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని నిర్మాత ప్రసన్న కుమార్ కోరారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks