అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్

ఓటీటీ రిలీజ్ అవుతోన్న కొత్త తెలుగు వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. జియో హాట్‌స్టార్‌లో జూన్ 6 నుంచి దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్‌గా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దేవిక అండ్ డానీలో హీరోగా చేసిన సూర్య వశిష్ట్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

Published on: Jun 4, 2025, 13:27:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియో హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి జియో హాట్‌స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్‌ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది.

అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్
అక్కడుండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి.. బయటకు వెళ్తే ఎలా మారుతారో చెప్పేదే ఓటీటీ సిరీస్: హీరో సూర్య వశిష్ట కామెంట్స్

దేవిక అండ్ డానీ నటీనటులు

జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో రీతు వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరో హీరోయిన్స్‌గా నటించారు. సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో న‌టించారు.

దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్

బి. కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్ను సుధాక‌ర్ చాగంటి నిర్మించారు. జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ కానున్న సందర్భంగా రీసెంట్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో సూర్య వశిష్ట ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

ఎలా మారుతారనే విషయాన్ని

సూర్య వశిష్ట మాట్లాడుతూ.. "సాధారణంగా ఊర్ల‌లో ఉండే అమ్మాయిల‌కు చాలా ఇబ్బందులుంటాయి. ఈ ప‌ని చేయాల‌ని, ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అంటుంటారు. అలాంటి వాళ్లు బ‌య‌ట‌కు వెళితే ఎలా మారుతార‌నే ఓ విష‌యాన్ని చ‌క్క‌గా దేవిక అండ్ డానీ ఓటీటీ సిరీస్‌లో చూపించారు" అని అన్నాడు.

ఫ్యామిలీ మెంబర్‌లా

"దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బు లాంటి పాత్ర‌లు ఎలా మార్చాయ‌నేది కూడా ఇందులో చూడొచ్చు. త‌ప్ప‌కుండా ఈ సిరీస్ అంద‌రికీ న‌చ్చుతుంది. నిర్మాత సుధాక‌ర్ అరుదైన వ్య‌క్తి. మా డైరెక్ట‌ర్ కిషోర్‌ గారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌లా మాతో క‌లిసిపోయారు. సినిమాటోగ్రాఫ‌ర్ దిలీప్‌ గారి ఫ్రేమింగ్‌, లైటింగ్ సూప‌ర్బ్‌. నందిని గారు బిహైండ్ ది సీన్స్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు" అని సూర్ వశిష్ట తెలిపాడు.

ఫ్రెష్ కంటెంట్‌ను

"ఫ్రెష్ కంటెంట్‌ను అందిస్తోన్న జియో హాట్‌స్టార్‌కి థాంక్స్‌. రీతూవ‌ర్మ చాలా మంచి కోస్టార్‌. శివ కందుకూరి అయితే నా బ్ర‌ద‌ర్‌లా మారిపోయారు. త‌ను అద్భుతంగా న‌టించాడు. డానీ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్ర‌లు చ‌క్క‌గా క‌నెక్ట్ అవుతాయి" అని హీరో సూర్య వశిష్ట చెప్పుకొచ్చాడు.

ఓటీటీ మలయాళం

ఇదిలా ఉంటే, జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. మోహన్ లాల్, శోభన నటించిన తుడరుమ్‌తోపాటు సిమ్రాన్ యాక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More