నన్ను చిలకా అంటావా అంటూ డైరెక్టర్‌పై మండిపడిన నటి.. హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్‌గా ఉండటం బాధ కలిగించిందంటూ..

తమిళ నటి దివ్యభారతి.. తెలుగు డైరెక్టర్ పై తీవ్రంగా మండిపడింది. తనను చిలకా అని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. సెట్‌లోనూ ఇలాగే అంటాడని, అయినా హీరో సైలెంట్ గా ఉండటం తనకు బాధ కలిగించిందని ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Nov 19, 2025, 17:24:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ నటి దివ్యభారతి తన తొలి తెలుగు మూవీ గోట్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి (నరేష్ కే లీ) పై తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాదు ఇంత జరిగినా హీరో సుడిగాలి సుధీర్‌ కూడా మౌనంగా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్శకుడు చేసిన స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలు, సెట్‌లో అతని ప్రవర్తనను ఆమె తీవ్రంగా ఖండించింది. ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

నన్ను చిలకా అంటావా అంటూ డైరెక్టర్‌పై మండిపడిన నటి.. హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్‌గా ఉండటం బాధ కలిగించిందంటూ..
నన్ను చిలకా అంటావా అంటూ డైరెక్టర్‌పై మండిపడిన నటి.. హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్‌గా ఉండటం బాధ కలిగించిందంటూ..

డైరెక్టర్, సుధీర్‌పై దివ్యభారతి సీరియస్

తమిళ నటి దివ్యభారతి సుడిగాలి సుధీర్ తో కలిసి తన తొలి తెలుగు మూవీ గోట్ లో నటిస్తోంది. దీనిని నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే అతడు ఆన్‌లైన్‌లో తనను ‘చిలక’ అని, ‘సెకండ్ లీడ్ యాక్ట్రెస్’గా మాత్రమే పనికొస్తుందని పేర్కొంటూ చేసిన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌ను దివ్యభారతి పంచుకుంది.

"మహిళలను 'చిలక' లేదా మరే ఇతర పదంతో పిలవడం హాని కలిగించని జోక్ కాదు. ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీద్వేషానికి అద్దం పడుతుంది. ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఈ దర్శకుడు సెట్‌లో కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మహిళలను పదేపదే అగౌరవపరిచాడు. నిజాయితీగా చెప్పాలంటే తాను సృష్టించాలనుకుంటున్న కళకే ద్రోహం చేశాడు" అని ఆమె మండిపడింది.

సుడిగాలి సుధీర్ మౌనంపై..

అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేస్తున్న సుడిగాలి సుధీర్ దీనిపై మౌనంగా ఉండటంపైనా ఆమె మండిపడింది. "నన్ను బాగా నిరాశపరిచిన విషయం ఏమిటంటే.. హీరో మౌనంగా ఉండి, ఈ సంస్కృతి మరో రోజు కొనసాగడానికి అనుమతించడం. నేను మెరుగైన వాటిని ఎంచుకుంటాను.. మహిళలు అపహాస్యం పాలు కాని, ప్రతి గొంతుకు విలువ ఉండే, గౌరవం అనేది రాజీపడలేనిదిగా ఉండే వాటిని నేను ఎంచుకుంటాను. ఇది కేవలం ఛాయిస్ మాత్రమే కాదు. ఇది ఒక కళాకారిణిగా, ఒక మహిళగా నా స్టాండర్డ్" అని ఆమె రాసుకొచ్చింది.

తనపై విమర్శలు చేసినవారికి, తనకు ఎప్పుడూ ఇతరులతో సమస్యలు ఉంటాయని కామెంట్ చేసిన వారికి కూడా ఆమె గట్టిగా బదులిచ్చింది. "తమిళ సినిమాల్లో అదే టీమ్, నటులు, సిబ్బందితో నేను ఎటువంటి విభేదాలు లేకుండా పదేపదే పనిచేశాను. ఈ ఒక్క దర్శకుడు మాత్రమే హద్దులు దాటి అగౌరవపరిచే వ్యాఖ్యలు చేశాడు. అతను దాన్ని పబ్లిక్ చేశాడు. కాబట్టి స్పందించే హక్కు నాకు ఉంది" అని దివ్యభారతి స్పష్టం చేసింది.

దివ్యభారతి గురించి

దివ్యభారతి మోడల్‌గా పనిచేసింది. ఆమె 2021లో జి.వి. ప్రకాష్ సరసన నటించిన తమిళ చిత్రం 'బ్యాచిలర్' తో పేరుగాంచింది. ఇక 2024 హిట్ మూవీ ‘మహారాజా’లో చిన్న అతిథి పాత్ర పోషించింది. ఈ ఏడాది ప్రకాశ్‌తో కలిసి 'కింగ్‌స్టన్' అనే తమిళ చిత్రంలో నటించింది. తెలుగులో తొలిసారిగా ఈ గోట్ లోనే నటిస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆమె జియోహాట్‌స్టార్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More