ఆయన లేకుంటే ఇంద్రజ అనే పేరు లేదు.. హీరోయిన్‌గా కెరీర్ లేదు.. నటి ఇంద్రజ కామెంట్స్

ఆయన లేకుంటే ఇంద్రజ అనే పేరు లేదు, హీరోయిన్‌గా కెరీర్ లేదంటూ సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దిగ్జజ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఇంద్రజతోపాటు హీరోయిన్స్ ఆర్కే రోజా, ఆమని, లయ వ్యాఖ్యలు చేశారు.

Jun 4, 2025, 11:30:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్యామిలీ మొత్తం కలిసి ఆనందంగా చూసే వంటి చిత్రాలు తెరకెక్కించిన టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. వినోదం, మాయలోడు, కొబ్బరి బొండాం, శుభలగ్నం, ఎగిరే పావురమా, యమలీల వంటి ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతోమంది హీరోయిన్స్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే, మరికొంతమంది కెరీర్‌కు ఉపయోగపడ్డారు.

ఆయన లేకుంటే ఇంద్రజ అనే పేరు లేదు.. హీరోయిన్‌గా కెరీర్ లేదు.. నటి ఇంద్రజ కామెంట్స్
ఆయన లేకుంటే ఇంద్రజ అనే పేరు లేదు.. హీరోయిన్‌గా కెరీర్ లేదు.. నటి ఇంద్రజ కామెంట్స్

సీనియర్ హీరోయిన్స్ కామెంట్స్

అలాంటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుటినరోజు వేడుకలు జూన్ 1న హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో హీరోలు, నటులతోపాటు సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఆర్కే రోజా, రవళి, లయ, ఆమని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సీనియర్ హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మళ్లీ అవకాశం ఉంటే

నటి లయ మాట్లాడుతూ.. "ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్లీ అవకాశం ఉంటే ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది" అని అన్నారు.

జన్మనిచ్చింది ఆయన

"ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నాకు జన్మనిచ్చింది ఈవీవీ గారు అయితే పెంచింది ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన దర్శకత్వంలో నేను నటించిన శుభలగ్నం మూవీ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు అడుగుతుంటారు. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా" అని సీనియర్ హీరోయిన్, నటి ఆమని తెలిపారు.

దేవుడు పంపిన ఏంజెల్

సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ మాట్లాడుతూ.. "నేను ఏ వేదిక మీద మాట్లాడినా ముందు ఎస్వీ కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పే మాట్లాడుతా. ఆయన లేకుంటే నాకు ఇంద్రజ అనే పేరు లేదు, హీరోయిన్‌గా కెరీర్ లేదు. దేవుడు నా కోసం పంపిన ఏంజెల్ కృష్ణా రెడ్డి గారు అనుకుంటాను" అని చెప్పుకొచ్చారు.

క్రియేటివిటీ ఎలా ఉందో

"ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో చేసిన శుభలగ్నం మూవీ నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే, ఎంత ఫార్వార్డ్‌గా కృష్ణారెడ్డి గారి క్రియేటివిటీ ఉందో ఊహించుకోవచ్చు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని ఆర్కే రోజా వెల్లడించారు.

కేవీ రెడ్డి గారిని స్ఫూర్తిగా

ఇదే కార్యక్రమంలో నిర్మాత, ఎస్వీ కృష్ణారెడ్డి స్నేహితుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. "దర్శకుడు కేవీ రెడ్డి గారిని ఎస్వీ కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు. దర్శకరత్న దాసరి గారికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వీ చెప్పుకునేవారు" అని అన్నారు.

40 ఏళ్లుగా ఇండస్ట్రీలో

"ఎస్వీ కృష్ణారెడ్డిని నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఎంకరేజ్ చేశా. మా కాంబినేషన్‌లో గొప్ప చిత్రాలు రూపొందించాడు. మా మూవీస్‌లో చేసిన కుటుంబమంతా దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గర్వంగా ఉంది. వాళ్లంతా మా ఎస్వీ బర్త్ డే వేడుకలకు రావడం సంతోషాన్నిస్తోంది" అని ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి తెలిపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More