బ్రేక్ తీసుకుని 20 ఏళ్లు అవుతోంది.. సందేహాలు, భయాలు ఉండేవి.. హీరోయిన్ లయ కామెంట్స్
హీరోయిన్ లయ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది లయ. సీనియర్ హీరోయిన్ లయ నటిగా రీ ఎంట్రీ ఇస్తోన్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. హీరో నితిన్ నటించిన తమ్ముడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. లయ నటిగా రీ ఎంట్రీ ఇస్తోన్న తమ్ముడి సినిమాలో ఆమెతోపాటు వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వాసిక విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తమ్ముడు ట్రైలర్ రిలీజ్
జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 11న తమ్ముడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా తమ్ముడు ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బ్రేక్ తర్వాత రావాలనుకున్నప్పుడు
నటి లయ మాట్లాడుతూ.. "నేను సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. తమ్ముడు మూవీతో తిరిగి నా నట ప్రయాణం మొదలుపెట్టాను. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతోంది. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు సందేహాలు, భయాలు ఉండేవి. ఈ సినిమా టీమ్ నాలో ఆ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించారు" అని అన్నారు.
2 రోజులు ఫొటోషూట్
"శ్రీరామ్ వేణు గారు నాతో 2 రోజులు ఫొటోషూట్ చేయించి ఈ మూవీకి తీసుకున్నారు. అలాగే ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తున్న దిల్ రాజు గారి బ్యానర్‌తో నేను తిరిగి చిత్ర పరిశ్రమకు రావడం హ్యాపీగా ఉంది. మా ఆన్ స్క్రీన్ తమ్ముడు నితిన్తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది" అని హీరోయిన్ లయ తెలిపారు.
భర్త, పిల్లల సహాకారం
"నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చానంటే అందుకు నా భర్త, పిల్లల సహకారం ఎంతో ఉంది. నేను ఇప్పటిదాకా చేయాలనుకున్న పాత్రలు, సినిమాలు చేసే అవకాశం మరోసారి టాలీవుడ్ కల్పించింది. తమ్ముడు సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మా అందరిలో ఉంది" అని నటి లయ చెప్పుకొచ్చారు.
అద్భుతమైన చిత్రాలకు
ఇదే ఈవెంట్‌లో తమ్ముడు ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ.. "దిల్ రాజు గారి బ్యానర్‌లో అద్భుతమైన చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. తమ్ముడు చిత్రాన్ని శ్రీరామ్ వేణు గారు చాలా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. హీరో నితిన్, ఇతర నటీనటుల పర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. తమ్ముడు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని కోరారు.
సర్‌ప్రైజింగ్ ఫిల్మ్
"శ్రీరామ్ వేణుతో ఎంసీఏ, వకీల్ సాబ్ మూవీస్‌కు వర్క్ చేశాను. తమ్ముడు మూవీ ఒక సర్‌ప్రైజింగ్ ఫిల్మ్. శ్రీరామ్ వేణు ఒక సర్‌ప్రైజింగ్ సబ్జెక్ట్‌ను మీకు చూపించబోతున్నాడు. తమ్ముడు ట్రైలర్ మీకు నచ్చిందని భావిస్తున్నా. తమ్ముడు సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ కావాలి" అని సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



