పవన్ కల్యాణ్ గొప్ప నటుడు.. ప్రభాస్ చాలా మంచి మనిషి.. హీరోయిన్ నిధి అగర్వాల్ కామెంట్స్
పవన్ కల్యాణ్‌తో హరి హర వీరమల్లు, ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్న నిధి అగర్వాల్ ఆ సినిమా విశేషాలతోపాటు పవన్ కల్యాణ్, ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న బ్యూటిపుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో హరి హర వీరమల్లు, మరోవైపు డార్లింగ్ ప్రభాస్‌తో రాజా సాబ్ సినిమాలను చేస్తుంది నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రమోషన్స్‌లో భాగంగా
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్, ప్రభాస్‌తోపాటు హరి హర వీరమల్లు సినీ విశేషాలను పంచుకుంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.
నిర్మాత ఏఎం రత్నం గారి గురించి?
ఏఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.
ట్రైలర్‌కి వచ్చిన స్పందన ఎలా అనిపించింది?
హరి హర వీరమల్లు ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్‌కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది.
హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ గారితో, రాజా సాబ్‌లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్‌గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ కల్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.
పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కల్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. మంచి పాత్ర కూడా దక్కింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



