Urfi Javed: ఉర్ఫీ జావెద్ మతం మార్చుకుందా? ఫేక్ జర్నలిస్ట్‌కు ఊరమాస్ కౌంటర్ ఇచ్చిన నటి

Urfi Javed: తన వెరైటీ డ్రెస్సులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావెద్ మతం మార్చుకుందని, ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారిందన్న వార్తపై ఆమె స్పందించింది. ఈ పుకార్లకు కారణమైన ఫేక్ జర్నలిస్టుకు ఎడాపెడా ఇచ్చేసింది.

Published on: Jun 29, 2026, 21:01:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Urfi Javed: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావెద్ తన మతం మార్చుకుందంటూ గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూ ధర్మాన్ని స్వీకరించిందని, తన పేరును కూడా 'రీటా భరద్వాజ్'గా మార్చేసుకుందంటూ ఒక మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం పెద్ద దుమారమే రేపింది. నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్‌ను అస్సలు వదిలిపెట్టని ఉర్ఫీ.. ఈ ఫేక్ న్యూస్ ప్రచారంపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఆ జర్నలిస్ట్‌కు చుక్కలు చూపించింది.

Urfi Javed: ఉర్ఫీ జావెద్ మతం మార్చుకుందా? ఫేక్ జర్నలిస్ట్‌కు ఊరమాస్ కౌంటర్ ఇచ్చిన నటి
Urfi Javed: ఉర్ఫీ జావెద్ మతం మార్చుకుందా? ఫేక్ జర్నలిస్ట్‌కు ఊరమాస్ కౌంటర్ ఇచ్చిన నటి

"నా పేరు రీటా భరద్వాజ్ కాదు.. అసలు హోంవర్క్ చేశావా?"

మీతా చౌదరి అనే ఒక మహిళా జర్నలిస్ట్ ఉర్ఫీ జావెద్‌పై ఒక వీడియో చేస్తూ.. ఉర్ఫీ కేవలం సగం సగం బట్టలు వేసుకోవడం వల్లే ఫేమస్ అయిందని, ఆమె ఇప్పుడు ముస్లిం నుండి హిందువుగా మారిపోయిందని చెప్పింది.

దీనిపై ఉర్ఫీ జావెద్ లైవ్‌లోకి వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. "ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్లంతా ఈ మధ్య జర్నలిస్టులు అయిపోతున్నారు. ఆంటీ.. ప్లీజ్ కాస్త హోంవర్క్ చేసి మాట్లాడండి. నేను ఎప్పుడూ నా పేరును కానీ, నా మతాన్ని కానీ మార్చుకోలేదు. అసలు నాకు ఏ మతం పైనా నమ్మకం లేదు" అంటూ ఉర్ఫీ స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చింది.

"బట్టలే కాదు.. నా మాటలు కూడా నగ్నంగానే ఉంటాయి!"

తన డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శించిన సదరు జర్నలిస్ట్‌కు ఉర్ఫీ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది. "నేను కేవలం నా బట్టల విషయంలోనే కాదు.. నా మాటల విషయంలో కూడా అంతే పచ్చిగా, నగ్నంగా ఉంటాను. కానీ ఈరోజు నాకు ఎక్కువ మాట్లాడే మూడ్ లేదు. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి చూడు.. నేను ఇప్పటివరకు ఎన్ని టీవీ షోలు చేశానో, వాటిలో నా పేరు ఏంటో నీకే తెలుస్తుంది. మీ ఛండాలమైన మేకప్ చూస్తేనే నాకు సిగ్గుగా అనిపిస్తోంది. ఇక మీ జర్నలిజం గురించి ఎంత చెప్పినా వేస్టే. నాపై పగ ఉంటే డైరెక్ట్‌గా చూపించుకోండి కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం వ్యాప్తి చేయకండి" అంటూ ఉర్ఫీ ఫైర్ అయింది.

స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేసిన బోల్డ్ బ్యూటీ

ఈ గొడవ ఇక్కడితో అయిపోలేదు. ఆ జర్నలిస్ట్ పంపిన కొన్ని పర్సనల్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్‌ను కూడా ఉర్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మీతా చౌదరి అనే ఆంటీ బాగా ట్రిగ్గర్ అయిపోయిందని, తన పాత వీడియోలను డిలీట్ చేసి తనను బ్లాక్ చేసిందని ఉర్ఫీ బయటపెట్టింది.

"ఆమె ఫేస్ చూస్తుంటే మా తాతగారిలా అనిపిస్తోంది. అందుకే ఎక్కువ అగౌరవంగా మాట్లాడలేకపోతున్నా. నాపై అంతగా వ్యామోహం ఉంటే నేనేం చేయలేను" అంటూ ఉర్ఫీ ఎద్దేవా చేసింది.

రియాలిటీ షోస్ విన్నర్‌గా ఉర్ఫీ ప్రొఫెషనల్ కెరీర్

కేవలం కాంట్రవర్సీలతోనే కాకుండా ఉర్ఫీ జావెద్ తన కెరీర్‌లో మంచి సక్సెస్‌లు అందుకుంది. గత ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘ది ట్రెయిటర్స్ ఇండియా’ టైటిల్‌ను ఉర్ఫీ గెలుచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. దీనితో పాటు ‘ఎంగేజ్డ్ రోకా యా ధోకా’ అనే పాపులర్ షోకి హోస్ట్‌గా కూడా వ్యవహరించింది.

కెరీర్ మొదట్లో ‘యే రిష్తా క్యా కహలాతా హై’, ‘కసౌతీ జిందగీ కే 2’ లాంటి సూపర్ హిట్ డైలీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్, మ్యూజిక్ వీడియోలతో ఫుల్ బిజీగా ఉంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More