ట్రెండింగ్‌లో కన్నడ క్రైమ్ థ్రిల్లర్.. 8.6 ఐఎండీబీ రేటింగ్.. జీ5 ఓటీటీలో టాప్-5 మూవీస్ ఇవే.. రెండు కామెడీ సినిమాలు
జీ5 ఓటీటీలో కన్నడ క్రైమ్ థ్రిల్లర్ దూసుకెళ్తోంది. ట్రెండింగ్ లో నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ ఓటీటీలో టాప్-5 ట్రెండింగ్ సినిమాల్లో రెండు తెలుగు కామెడీ మూవీస్ ఉన్నాయి. మరి ఆ ట్రెండింగ్ ఫిల్మ్స్ ఏవో ఓ లుక్కేయండి.
డిఫరెంట్ కాన్సెస్ట్ తో వస్తున్న సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్ మూవీస్ తదితర జోనర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కన్నడ మూవీ జీ5లో అదరగొడుతోంది. నంబర్ వన్ గా ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న ఆ మూవీనే ‘అజ్ఞాతవాసి’. దీంతో పాటు జీ5 ఓటీటీలో టాప్-5లో ఉన్న మూవీస్ ఏంటో చూసేయండి.

ఆ మర్డర్ చుట్టూ
అజ్ఞాతవాసి మూవీ మర్డర్ మిస్టరీ డ్రామాగా సాగుతోంది. ఈ కన్నడ సినిమా ఏప్రిల్ 11, 2025న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూస్ దూసుకెళ్లింది. మే 28న జీ5 ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ. 25 ఏళ్లుగా క్రైమ్ అన్నదే లేని ఓ ఊర్లో అనూహ్యంగా మర్డర్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ. ఆ మర్డర్ ఎవరు చేశారు? అనే మిస్టరీ థ్రిల్లర్ గా సాగుతున్న అజ్ఞాతవాసి మూవీ ఆడియన్స్ ను అలరిస్తోంది. కానీ కన్నడ భాషలోనే ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
తెలుగు కామెడీ మూవీస్
జీ5 ఓటీటీలో రాబిన్ హుడ్, సంక్రాంతికి వస్తున్నాం కామెడీ సినిమాలు కూడా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. రాబిన్ హుడ్ సెకండ్ ప్లేస్ లో ఉండగా.. సంక్రాంతికి వస్తున్నా అయిదో స్థానంలో ఉంది. మార్చి 28న థియేటర్లకు వచ్చిన రాబిన్ హుడ్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ మే 10న జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మార్చి 1న అటు టీవీతో పాటుఓటీటీలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అందరినీ కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది.
డిఫరెంట్ జోనర్స్
కస్టమ్స్ ఆఫీసర్ కొస్టావో ఫెర్నాండెజ్ బయోపిక్ గా వచ్చిన ‘కొస్టావో’, క్రైమ్ థ్రిల్లర్ గా రిలీజైన ‘ఇంటరాగేషన్’ సినిమాలు కూడా జీ5 ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. ఈ రెండు హిందీ సినిమాలు ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తున్నాయి. మే 1 నుంచి కొస్టావో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు క్రైమ్ థ్రిల్లర్ ఇంటరాగేషన్ కూడా అదరగొడుతోంది. రిటైర్డ్ జడ్జ్ తన ఇంట్లో శవమై కనిపిస్తారు. హత్య జరిగిన రోజు నలుగురు నిందితులు ఆయన ఇంటికి వెళ్లారని పోలీసులు గుర్తిస్తారు. మరి విచారణలో నిజమైన హంతకుడిని ఎలా కనిపెట్టారు? ఆ హత్య ఎవరు చేశారన్నది ఇంటరాగేషన్ స్టోరీ.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



