అఖండ 2 టీజర్.. మరోసారి బాలయ్య, బోయపాటి విశ్వరూపం.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది
అఖండ 2 టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే మేకర్స్ ఈ టీజర్ రిలీజ్ చేశారు. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సృష్టించబోయే రక్తపాతానికి ఈ టీజర్ అద్దం పడుతోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్‌బస్టరే. ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా సోమవారం (జూన్ 9) అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. మంగళవారం (జూన్ 10) బాలయ్య బాబు బర్త్ డే ఉండటంతో ఒక రోజు ముందే టీజర్ రావడం విశేషం. ఇందులో మరోసారి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించేశాడు.

అఖండ 2 టీజర్
ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ అఖండ 2. అయితే సుమారు మూడున్నర నెలల ముందే బాలకృష్ణ 65వ బర్త్ డేకు ఒకరోజు ముందు ఈ మూవీ టీజర్ వచ్చేసింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. పొడవాటి గడ్డం, చేతిలో త్రిశూలంతో బాలయ్య లుక్ చాలా పవర్‌ఫుల్ గా కనిపించింది.
ఒకేసారి ఐదారు మంది రౌడీలను గాల్లోకి ఎత్తి పారేయడమే కాదు.. తన చేతిలోని త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ల గొంతు కోసే సీన్ తో బోయపాటి టీజర్లోనే తన మార్క్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ను క్రియేట్ చేశాడు. నా శివుడి అనుమతి లేనిదే.. ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య ఓ పవర్‌ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు. ఇక తమన్ బీజీఎం కూడా ఈ టీజర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది.
అఖండ 2 మూవీ గురించి..
అఖండ 2 మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్, 2021లో రిలీజైన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా వస్తోంది. అప్పట్లో ఆ మూవీ ఓ సంచలనం. గతేడాదే ఈ మూవీకి సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. దీంతో బాలయ్య బాబు అభిమానుల్లో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇప్పుడు వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బాలకృష్ణ, బోయపాటి మూవీలోని అన్ని కమర్షియల్ మాస్ మసాలా హంగులన్నీ అఖండ 2లో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. బాలయ్య అభిమానులకు ఒకరోజు ముందే అందిన బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



