...
...
Next Story

మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..

ఆ ఒక్కటి అడక్కు సినిమా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఓ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టనుంది. డేట్ ఖరారైంది.

Published on: Jun 3, 2025, 13:02:40 IST
By
Prefer HTon Google
Advertisement

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం గతేడాది మే 3వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కొన్నేళ్ల తర్వాత తన మార్క్ కామెడీ చిత్రాన్ని నరేశ్ చేయడంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ రిలీజయ్యాక ఈ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకుంది . దీంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పటికే ఓ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రం మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి..

మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..
మరో ఓటీటీలోకి రానున్న అల్లరి నరేశ్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..

ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. ఈ సినిమా గతేడాది మే చివర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ మూవీ మరో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈటీవీ విన్లో జూన్ 12న స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.

ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. పెళ్లి కోసం ఆరాటపడే ఓ ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీలో అల్లరి నరేశ్కు జోడీగా ఫారియా అబ్దుల్లా నటించారు. వెన్నెల కిశోర్, అరియానా గ్లోరీ, హర్షా చెముడు, జామీ లివర్, హరితేజ కీలకపాత్రలు పోషించారు.

బాక్సాఫీస్ ప్లాఫ్

బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు చిత్రం హిట్ కాలేకపోయింది. థియేటర్లలో రిలీజయ్యాక మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఈ చిత్రం సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం దాదాపు రూ.9కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. మొత్తంగా కమర్షియల్‍‍గా ప్లాఫ్ అయింది.

ఆ ఒక్కటి అడక్కు మూవీని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించగా.. సూర్య సినిమాటోగ్రఫీ చేశారు.

ఈటీవీ విన్‍లో ‘పెళ్లి కాని ప్రసాద్’

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe