ఓటీటీ డైరెక్టర్‌తో అల్లరి నరేష్ సరికొత్త సినిమా.. కిక్కెంచే టైటిల్‌గా ఆల్కహాల్.. హీరోయిన్‌గా మత్తెక్కించే హాట్ బ్యూటీ!
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సరికొత్త సినిమా ఆల్కహాల్. ఈ సినిమాకు ఓటీటీ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కిక్కెంచే టైటిల్‌గా ఆల్కహాల్‌ను పెట్టారు మేకర్స్. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే వివరాల్లోకి వెళితే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.

విభిన్న సినిమాలతో
ఇప్పుడు ఈ మూడు సంస్థలు కలిసి మరో విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నాయి. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్ విభిన్న సినిమాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు.
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్
అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు హీరో అల్లరి నరేష్. 'ఫ్యామిలీ డ్రామా' మూవీ ఫేమ్ మెహర్ తేజ్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. 2021లో అక్టోబర్ 29న థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఫ్యామిలీ డ్రామా చిత్రం మంచి ఆదరణ పొందింది.
ఓటీటీ దర్శకుడితో
అలాంటి ఓటీటీడైరెక్టర్ మెహర్ తేజ్‌తో అల్లరి నరేష్ సినిమా వస్తోంది. ఈ సినిమాకు కిక్కెంచేలా 'ఆల్కహాల్' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆల్కహాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆల్కహాల్‌లో మునిగిపోయిన దృశ్యం చూడొచ్చు.
మత్తెక్కించే అందాలతో
ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటి రుహాని శర్మ హీరోయిన్‌గా అల్లరి నరేష్‌తో జోడీ కట్టనుంది. సోషల్ మీడియాలో మత్తెక్కించే అందాలతో కవ్వించే బోల్డ్ బ్యూటీ రుహాని శర్మ కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేయడం విశేషంగా మారింది.
గిబ్రాన్ సంగీతం
ఇక ఆల్కహాల్ సినిమాకు ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆల్కహాల్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాత.
నిర్మాతగా నాగవంశీ
ఇదిలా ఉంటే, నిర్మాత నాగవంశీ వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు 'ఆల్కహాల్'తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంటామనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఆల్కహాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













