ఇదో గొప్ప గౌరవం.. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదీ

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తొలి గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు. ఇది తనకో గొప్ప గౌరవమని అతడు అన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు.

Published on: May 29, 2025, 16:37:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై గురువారం (మే 29) అతడు తన ఇన్‌స్టా ద్వారా స్పందించాడు. పుష్ప 2 మూవీకిగాను అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. మరి దీనిపై అతడు ఏమన్నాడో ఒకసారి చూడండి.

ఇదో గొప్ప గౌరవం.. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదీ
ఇదో గొప్ప గౌరవం.. బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదీ

అల్లు అర్జున్ ఏమన్నాడంటే..

తనకు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించాడు. తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో పుష్ప 2 కోసం నాకు తొలి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ ఘనత అంతా డైరెక్టర్ సుకుమార్ గారికి, ప్రొడ్యూసర్లకు, మొత్తం పుష్ప టీమ్ కు దక్కుతుంది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితమిస్తున్నాను. మీ సపోర్టే నన్ను ముందుకు తీసుకెళ్తుంది” అని బన్నీ పోస్ట్ చేశాడు.

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఇలా..

2024 ఏడాదికి సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం గురువారం (మే 29) అనౌన్స్ చేసింది. జ్యూరీ ఎంపిక చేసిన అవార్డీల జాబితా ఇక్కడ చూడండి.

ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి 2898 ఏడీ

ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్

ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటిగా నివేదిత థామస్ (35)

ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్

ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్

బెస్ట్‌ స్టోరీ రైటర్‌-శివ పాలడుగు

బెస్ట్‌ స్ర్కీన్‌ప్లే -వెంకీ అట్లూరి

బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌- గణేశ్‌ ఆచార్య

బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌- చంద్రశేఖర్‌

స్పెషల్‌ జ్యూరీ అవార్డు- దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్)

స్పెషల్‌ జ్యూరీ అవార్డు- అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ(కమిటీ)కి ఛైర్మన్ గా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. కమిటీలో సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More