ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!

ఓటీటీలో ఫాంటసీ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. నరకంలో విధించే శిక్షలపై రెండు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి కూడా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే రేటింగ్‌తో ఉన్న ఈ రెండు ఓటీటీ సినిమాలను ఇక్కడ చూసేయండి.

Published on: Jun 2, 2025, 05:30:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నరకం చూశాను అని చాలా మంది బాధలో కానీ, సమస్యలు ఫేస్ చేసినపపుడు కానీ వాడుతుంటారు. ఎంతో బాధ, కష్టం, భయం, నొప్పి వంటి భావాలు నరకంలో కలుగుతుంటాయనేది అందరి భావన. చేసిన కర్మల ఫలితానుసారం నరకంలో శిక్షలు పడుతుంటాయని అందరు నమ్ముతారు.

ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!
ఓటీటీలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్- నరకంలోని శిక్షలపై వణుకుపుట్టించే సీన్స్- 7.2 రేటింగ్- ఈ రెండు ఓటీటీల్లో చూసేయండి!

అపరిచితుడు సినిమాలో

మనుషులు చేసిన తప్పులు, నేరాలకు పడే శిక్షలు గరుడు పురాణంలో ఎలా ఉన్నాయో కాస్తా చెబుతూ అపరిచితుడు మూవీలో డైరెక్టర్ శంకర్ చూపించారు. అయితే, పూర్తిగా నరకంలో విధించే శిక్షలపై ఓ సినిమా ఉంటే. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు ఓటీటీ సినిమాల్లో నరకంలో విధించే శిక్షలను చూపించారు.

మనిషి చేసే ఒక్కో తప్పుకు ఎలాంటి శిక్ష ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా, భయంకరమైన సీన్స్‌తో ఈ రెండు ఓటీటీ సినిమాల్లో చూపించారు. ఆ ఓటీటీ సినిమాలే 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్', 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్'. ఈ రెండు సినిమాలు సౌత్ కొరియన్ ఫాంటసీ అడ్వెంచర్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కాయి.

బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్

ది టూ వరల్డ్స్ సినిమా 2017లో విడుదల అయితే.. ఆ తర్వాతి సంవత్సరం 2018లోనే ది లాస్ట్ 49 డేస్ రిలీజ్ అయింది. రెండు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ది టూ వరల్డ్స్ సినిమాకు 18.3 మిలియన్ డాలర్ల బడ్జెట్ అయితే బాక్సాఫీస్ వద్ద 109.4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, ఐఎమ్డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించింది.

ఇక మొదటి పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చిన రెండో సినిమా 'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్'కు 18.3 మిలియన్ డాలర్స్ ఖర్చు అయితే బాక్సాఫీస్ వద్ద 92.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.1 రేటింగ్ సంపాదించుకుంది. ఈ రెండు సినిమాలకు కిమ్ యోంగ్ హవా దర్శకత్వం వహించారు.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

జూ హో మిన్ రాసిన ఎలాంగ్ విత్ ది గాడ్స్ నవల ఆధారంగా ఈ రెండింటిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో ఎలాంగ్ విత్ ది గాడ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్, అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ రెండు అందుబాటులో ఉన్నాయి.

'ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్' కథలోకి వెళ్తే.. ఓ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన హీరో దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వారు హీరోను నరకానికి తీసుకెళ్తారు.

పునర్జన్మ కావాలంటే

హీరోకు మళ్లీ పునర్జన్మ కావాలంటే అతను చేసిన తప్పులకు తగిన శిక్షలు అనుభవించి అందులో నుంచి బయట పడాలి. అలా అయితే, మరో జన్మ ఉంటుందని చెబుతారు. ఆ శిక్షల నుంచి హీరో బయటపడ్డాడా?, ఆ శిక్షలు ఎలా ఉన్నాయనేదే? ఈ సినిమా కథ.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More