అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ టాప్ 10 సినిమాలు ఉన్నాయి. వీటిలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలుగా ఐదు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి నేటి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 21, 2025 2:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ ప్రపంచంలో ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో. డిఫరెంట్ కంటెంట్‌తో అలరించే అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (జూన్ 21) టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, అందులో ది బెస్ట్ 5 ఓటీటీ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

ది ట్రెయిటర్స్ ఓటీటీ

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో ది ట్రెయిటర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

గ్రౌండ్ జీరో ఓటీటీ

పవన్ కల్యాణ్ ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి హీరోగా నటించిన హిందీ వార్ బ్యాక్ డ్రామ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్రౌండ్ జీరో అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 2 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

లెవెన్ ఓటీటీ

నవీన్ చంద్ర నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన లెవెన్ ఇవాళ టాప్ 3, టాప్ 7 రెండు స్థానాల్లో ట్రెండ్ అవుతోంది. ఏకంగా రెండు ప్లేసుల్లో ఓటీటీ ట్రెండింగ్ అవడం, ఆద్యంతం థ్రిల్లింగ్ సీన్లతో సాగే ఈ సినిమాను చూడటం బెస్ట్ ఆప్షన్.

ఏస్ ఓటీటీ

విజయ్ సేతుపతి నటించిన హీస్ట్ క్రైమ్ కామెడీ తమిళ చిత్రం ఏస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాషలో టాప్ 4 ప్లేసులో అమెజాన్ ప్రైమ్లో ఏస్ ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. కామెడీ, క్రైమ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా చూడటం బెటర్ ఆప్షన్.

బ్లైండ్ స్పాట్ ఓటీటీ

నవీన్ చంద్ర నటించిన మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ ప్రైమ్ వీడియోలో టాప్ 5వ స్థానంలో ఓటీటీ ట్రెండింగ్లో ఉంది. ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా చూసేందుకు బెస్ట్.

భూల్ చుక్ మాఫ్ ఓటీటీ

హిందీ టైమ్ ట్రావెల్ కామెడీ చిత్రం భూల్ చుక్ మాఫ్. వామికా గబ్బి, రాజ్ కుమార్ రావు జోడీ కట్టిన భూల్ చుక్ మాఫ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 6వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

సింగిల్ ఓటీటీ

ఆద్యంతం కామెడీతో ఎంటర్‌టైన్ చేసే సింగిల్ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో చూడటం బెస్ట్ ఆప్షన్. శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ పండించిన సింగిల్ ఓటీటీలో టాప్ 8 ప్లేసులో తెలుగులో ట్రెండ్ అవుతోంది.

ది అకౌంటెంట్ 2 ఓటీటీ

తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది అకౌంటెంట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 9 స్థానంలో ఓటీటీ ట్రెండ్ అవుతోంది. అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్.

పంచాయత్ ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కామెడీ సిరీస్ పంచాయత్ హిందీలో టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఇలా ఇవాళ్టీ అమెజాన్ ప్రైమ్ టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూసేందుకు బెస్ట్‌గా ఉన్న ఐదింటిని చూసేయండి.

News/Entertainment/అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!
News/Entertainment/అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇవాళ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన ది బెస్ట్ 5 ఇవే.. అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!