అమ్మ పాడే జోల పాట లిరిక్స్: అమ్మ ప్రేమను ప్రతిబింబించే ఈ సాంగ్ అమ్మలందరికీ అంకితం.. ఈ మదర్స్ డేనాడు మీ అమ్మ కోసం పాడండి

అమ్మ పాడే జోల పాట అంటూ గతేడాది వచ్చిన పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. యూట్యూబ్ లో ఇప్పటికే 9 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ రాబోయే మదర్స్ డేనాడు మీ అమ్మ కోసం ఈ పాట పాడండి. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.

Published on: May 8, 2025, 19:09:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమ్మను వర్ణించడానికి ఎలా పదాలు, పాటలు సరిపోవు. సృష్టికే మూలం అమ్మ అయినప్పుడు ఆమెను ఏమని పొగడగలం. అలాంటి అమ్మల కోసం ప్రత్యేకంగా ఓ రోజును ప్రతి ఏటా మనం జరుపుకుంటాం. ఈ ఏడాది మదర్స్ డే వచ్చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మ పాడే జోల పాట అంటూ గతేడాది వచ్చి సంచలనం సృష్టించిన పాట గురించి తెలుసుకుందాం.

అమ్మ పాడే జోల పాట లిరిక్స్: అమ్మ ప్రేమను ప్రతిబింబించే ఈ సాంగ్ అమ్మలందరికీ అంకితం.. ఈ మదర్స్ డేనాడు మీ అమ్మ కోసం పాడండి
అమ్మ పాడే జోల పాట లిరిక్స్: అమ్మ ప్రేమను ప్రతిబింబించే ఈ సాంగ్ అమ్మలందరికీ అంకితం.. ఈ మదర్స్ డేనాడు మీ అమ్మ కోసం పాడండి

అమ్మ పాడే జోల పాట సాంగ్

అమ్మపాట అంటూ గతేడాది మిట్టపల్లి స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ అద్భుతమైన సాంగ్ రిలీజైంది. మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాయగా.. జాహ్నవి ఎర్రం పాడింది. సిస్కో డిస్కో అందించిన మ్యూజిక్ ఈ సాంగ్ ను ప్రతి తెలుగు ఇంటికీ తీసుకెళ్లింది.

అమ్మ పాడే జోలి పాటలోని మాధుర్యానికి కాస్త ఆధునికతను జోడించి కంపోజ్ చేసిన మ్యూజిక్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక జాహ్నవి వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటికే 9 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మరి అలాంటి సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ మదర్స్ డే నాడు మీ అమ్మ కోసం పాడి ఆమెకు అంకితమివ్వండి.

అమ్మపాట లిరిక్స్

పల్లవి

అమ్మపాడే జోలపాట

అమృతానికన్నా తియ్యనంట

అమ్మపాడే లాలిపాట

తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి

రెండు బుగ్గలు గిల్లేసి

నిండు జాబిలి చూపించి

గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన

ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన

అమ్మపాడే జోలపాట

అమృతానికన్నా తియ్యనంట

చరణం 1

కురిసే వాన చినుకులకి

నీలినింగి అమ్మ

మొలిచే పచ్చని పైరులకి

నేలతల్లి అమ్మ (2)

వీచే చల్లని గాలులకి

పూలకొమ్మ అమ్మ

ప్రకృతిపాడే పాటలకి

యలకోయిల అమ్మ

సృష్టికి మూలం అమ్మతనం

సృష్టికి మూలం అమ్మతనం

సృష్టించలేనిది అమ్మ గుణం

అమ్మపాడే జోలపాట

అమృతానికన్నా తియ్యనంట

అమ్మపాడే లాలిపాట

తేనెలూరి పారే ఏరులంట

చరణం 2

నింగిని తాకే మేడలకి

పునాది రాయి అమ్మ

అందం పొందిన ప్రతి శిలకి

ఉలిగాయం అమ్మ (2)

చీకటి చెరిపే వెన్నెలకి

జాబిల్లి అమ్మ

లోకం చూపే కన్నులకి

కంటిపాప అమ్మ

అమ్మంటే అనురాగ జీవనీ

అమ్మంటే అనురాగ జీవనీ

అమ్మ ప్రేమే సంజీవని

అమ్మపాడే జోలపాట

అమృతానికన్నా తియ్యనంట

మా అమ్మ.. అమ్మపాడే లాలిపాట

తేనెలూరి పారే ఏరులంట

నిండు జాబిలి చూపించి

రెండు బుగ్గలు గిల్లేసి

నిండు జాబిలి చూపించి

గోటితో బుగ్గను గిల్లేసి

ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన

ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెన

అమ్మపాడే జోలపాట

అమృతానికన్నా తియ్యనంట

మా అమ్మపాడే లాలిపాట

తేనెలూరి పారే ఏరులంట

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More