Anakapalli: ఈ తెలుగు సినిమా ఆ ఒక్క ఊళ్లోనే రిలీజ్ అవుతోంది.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేకర్స్.. ప్రొడ్యూసర్ కొడుకే హీరో

Anakapalli Movie: ఓ తెలుగు సినిమా కేవలం ఒకే ఒక్క ఊళ్లో రిలీజ్ అవుతున్న విషయం మీకు తెలుసా? ఆ ఊళ్లో ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాతే మిగిలిన తెలుగు రాష్ట్రాల్లోని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఆ మూవీ పేరు అనకాపల్లి.

Published on: Aug 6, 2026, 16:23:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anakapalli Movie Release: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ (Vikram Sahidev) కథానాయకుడిగా నటించిన రస్టిక్ యాక్షన్ డ్రామా 'అనకాపల్లి' ఆగస్టు 7న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విచిత్రమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు అంతటా కాకుండా కేవలం 'అనకాపల్లి' పట్టణంలో మాత్రమే ఈ చిత్రాన్ని ముందుగా విడుదల చేస్తున్నారు.

Anakapalli: ఈ తెలుగు సినిమా ఆ ఒక్క ఊళ్లోనే రిలీజ్ అవుతోంది.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేకర్స్.. ప్రొడ్యూసర్ కొడుకే హీరో
Anakapalli: ఈ తెలుగు సినిమా ఆ ఒక్క ఊళ్లోనే రిలీజ్ అవుతోంది.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేకర్స్.. ప్రొడ్యూసర్ కొడుకే హీరో

అనకాపల్లిలోనే ఫస్ట్ షో.. నిర్మాతల మైండ్ బ్లాంక్ ప్లాన్

సాధారణంగా ఏ సినిమా అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. కానీ 'అనకాపల్లి' మేకర్స్ మాత్రం కేవలం అనకాపల్లి ఊరిలోనే ముందుగా ప్రదర్శించి ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలని డిసైడ్ అయ్యారు.

ఇక్కడ వచ్చే పబ్లిక్ టాక్‌ను బట్టి మిగిలిన ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో గ్రాండ్‌గా విస్తరించాలని నిర్మాత లగడపాటి శ్రీధర్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు.. ట్రేడ్ వర్గాలు షాక్

సినిమా రేపే విడుదల కాబోతున్నా అనకాపల్లి పట్టణంలోని థియేటర్లలో కూడా ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కనీసం బుకింగ్స్ కూడా స్టార్ట్ చేయకుండా ఈ రేంజ్ రిస్క్ చేయడం వెనుక మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ వినూత్న ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందోనని టాలీవుడ్ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా.. విక్రమ్ సహిదేవ్ ఊరమాస్ లుక్

రేసుగుర్రం, రుద్రమదేవి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన విక్రమ్ సహిదేవ్.. ఈ సినిమాలో 'సూర్య' అనే పవర్‌ఫుల్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో సాగే ప్రేమ కథ, యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సూర్య పాత్రలోని రెండు విభిన్నమైన షేడ్స్‌లో విక్రమ్ నటన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో ఆయన చూపించిన వేరియేషన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

దర్శకనిర్మాతగా త్రినాథరావు నక్కిన వినూత్న ప్రయోగం

'ధమాకా', 'నేను లోకల్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లందించిన మాస్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాకుండా సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించి ఆడియన్స్‌ను అలరించబోతున్నారు.

ఖగేష్ తమ్మినేని టేకింగ్, దేవ్‌జాండ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి.

టాక్ పాజిటివ్‌గా వస్తే స్టేట్ వైడ్ రిలీజ్

ఈ రకమైన డిఫరెంట్ రిలీజ్ స్ట్రాటజీ వల్ల పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయని, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మూవీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ అనకాపల్లిలో ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే, వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బిగ్ లెవెల్లో థియేటర్ల సంఖ్య పెంచేలా మేకర్స్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. రేపు రాబోయే మొదటి షో టాక్‌తో విక్రమ్ సహిదేవ్ అదృష్టం ఎలా మారబోతోందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More