Pawan Kalyan Health Update : ముంబైలో పవన్ కళ్యాణ్‌కు సర్జరీ పూర్తి - ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?

Pawan Kalyan Shoulder Surgery : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం మూడున్నర గంటలపాటు శ్రమించి ఈ సర్జరీని పూర్తి చేసింది.

Published on: Jul 11, 2026, 15:18:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. శనివారం ఆయన కుడి భుజానికి వైద్యులు ఈ సర్జరీని నిర్వహించారు. కుడి భుజానికి ఉన్న రొటేటర్ కఫ్ కండరాల గాయంతో పాటు అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో వైద్యులు ఈ భారీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ (ఫైల్ ఫొటో)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ (ఫైల్ ఫొటో)

గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శనివారం కుడి భుజానికి సర్జరీని పూర్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.

“ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు” అని జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స నుంచి త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స విజయవంతం కావడం సంతోషకరం. ఆయన పూర్తి ఆరోగ్యంతో, త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఆయనకు మానసిక ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు నాయుడు తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More