...
...
Next Story

రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్- మహేష్ బాబు దర్శకత్వం- రామ్ పోతినేని, ఉపేంద్రపై కీలక సన్నివేశాలు!

హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను రాజమండ్రిలో ప్రారంభించారు. రామ్ పోతినేని-ఉపేంద్రలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: Jun 30, 2025, 11:22:33 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చివరిగా స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో అలరించాడు. అయితే, ఈ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో రామ్ పోతినేని.

భారీ స్థాయిలో నిర్మాణం

రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్- మహేష్ బాబు దర్శకత్వం- రామ్ పోతినేని, ఉపేంద్రపై కీలక సన్నివేశాలు!
రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్- మహేష్ బాబు దర్శకత్వం- రామ్ పోతినేని, ఉపేంద్రపై కీలక సన్నివేశాలు!

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా తాజా కొత్త షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైంది.

డై హార్డ్ ఫ్యాన్‌గా హీరో

రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ పోతినేని డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్‌గా పాత్రలో కనిపిస్తారు. అంటే సినిమాలో హీరో రామ్ పోతినేని మొదటిసారిగా డై హార్డ్ ఫ్యాన్ రోల్ చేయనున్నాడు.

టైటిల్ గ్లింప్స్‌ రెస్పాన్స్

దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రామ్ పోతినేని-ఉపేంద్రతోపాటు కమెడియన్ సత్యకు సంబంధించిన షూటింగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల విడుదలైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

భాగ్యశ్రీ బోర్సే సినిమాలు

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత భాగ్యశ్రీ చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ కింగ్‌డమ్, అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాల్లో కూడా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రా కింగ్ తాలూకా డైరెక్టర్

జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా చేస్తున్నారు. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సేతోపాటు రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe