Anumana Pakshi OTT Release Date: ఓవర్‌థింకింగ్‌లో ఆస్కార్ విన్నర్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?

Anumana Pakshi OTT Release Date: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా అనుమాన పక్షి వచ్చేస్తోంది. గత సెప్టెంబర్ లో రిలీజైన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.

Published on: Nov 13, 2026, 20:18:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anumana Pakshi OTT Release Date: టాలీవుడ్‌లో యూత్‌ను ఒక ఊపు ఊపిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘డీజే టిల్లు’ రచయిత, దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన మరో క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత సన్ నెక్ట్స్ ద్వారా డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అతిగా ఆలోచించే మనస్తత్వం ఉన్న ఓ కుర్రాడి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విశేషాలు ఇక్కడ చూద్దాం.

Anumana Pakshi OTT Release Date: ఓవర్‌థింకింగ్‌లో ఆస్కార్ విన్నర్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?
Anumana Pakshi OTT Release Date: ఓవర్‌థింకింగ్‌లో ఆస్కార్ విన్నర్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు కామెడీ డ్రామా.. ఎప్పుడంటే?

అనుమాన పక్షి మూవీ విశేషాలు

తెలుగు సినీ ప్రేక్షకులకు 'డీజే టిల్లు' సినిమా అందించిన వినోదం అంతాఇంతా కాదు. ఆ చిత్రానికి తనదైన పదునైన సంభాషణలు, వైవిధ్యమైన మేకింగ్‌తో ప్రాణం పోసిన దర్శక రచయిత విమల్ కృష్ణ.. అనుమాన పక్షి మూవీతో వచ్చిన అంతగా అలరించలేకపోయారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

"ఒక్క అబ్బాయి! బిలియన్ ఆలోచనలు! జీరో చిల్! అతిగా ఆలోచించడంలో ఆస్కార్ గెలుచుకునే కుర్రాడిని కలవండి! డీజే టిల్లు రచయిత, దర్శకుడి నుండి వచ్చిన మరో ఔట్ అండ్ ఔట్ సైక్ కామెడీ డ్రామా 'అనుమాన పక్షి' నవంబర్ 20 నుండి సన్ నెక్స్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.

‘అనుమాన పక్షి’ కథాంశం ఏమిటి?

పేరుకు తగ్గట్టుగానే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, లేనిపోని అనుమానాలతో సతమతమయ్యే ఓ యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేటి యువతలో చాలామంది ఎదుర్కొనే 'ఓవర్ థింకింగ్' (Overthinking) సమస్యను హాస్యాస్పదంగా, అదే సమయంలో ఆలోచింపజేసే విధంగా దర్శకుడు తీర్చిదిద్దారు.

సాధారణ రొటీన్ కామెడీకి భిన్నంగా, పాత్రల మనస్తత్వాల మధ్య జరిగే సంఘర్షణతో కడుపుబ్బా నవ్వించేలా 'సైక్ కామెడీ డ్రామా' జానర్‌లో దీనిని మలిచారు. సన్నీ (రాగ్ మయూర్)కి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. సమయం సందర్భంతో సంబంధం లేకుండా ప్రతి చిన్న విషయాన్నీ విపరీతంగా అనుమానించడం అతడి నైజం. అంతటితో ఆగకుండా తన మనసులో మెదిలే ప్రతి అనుమానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

ఈ అలవాటే అతడిని ఊహించని చిక్కుల్లో పడేస్తుంది. సన్నీ పెట్టిన ఒక పోస్ట్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని కశ్మీర్ నుంచి అనంత్ (చరిత్) అనే వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపుతాడు. సన్నీ వెంటనే కశ్మీర్ రాకపోతే ఆత్మహత్య చేసుకుని అతడి పేరే సూసైడ్ నోట్‌లో రాస్తానని హెచ్చరిస్తాడు.

కశ్మీర్ ప్రయాణం.. మలుపు తిరిగిన కథ

అనంత్ బెదిరింపుతో భయపడిపోయిన సన్నీ తన మిత్రుడు వర్మ (ప్రిన్స్)ను తీసుకుని కశ్మీర్ బయలుదేరతాడు. అక్కడ సన్నీకి కన్య (మెరిన్ ఫిలిప్) పరిచయమై, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో వర్మ ఊహించని విధంగా రిసార్ట్‌లో మరణిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రిసార్ట్‌కు విశాఖపట్నం పోలీస్ అధికారి వాసు (అజయ్), అతడి భార్య సుజాత (రాశి) వస్తారు.

సుజాతకు ఆత్మలతో మాట్లాడే ప్రత్యేక శక్తి ఉండటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. వర్మ మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ అనుమానాల సుడిగుండం నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అనంత్‌కు సన్నీ వల్ల జరిగిన నష్టం ఏంటీ? ఆత్మలతో సుజాత ఎలా మాట్లాడగలుగుతుంది? అనేది మిగిలిన కథ. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయితే ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More