అనుష్క శెట్టి ఘాటి వచ్చేది ఈ ఓటీటీలోకే.. రికార్డు ధరకు డిజిటల్ హక్కులు అమ్మకం
అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి మూవీ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జులై 11న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే వచ్చిన టీజర్ ఆకట్టుకునేలా సాగింది.
అనుష్క శెట్టి నటిస్తున్న కొత్త మూవీ 'ఘాటి' వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయని, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.

ఘాటి వచ్చేది ఈ ఓటీటీలోకే..
అనుష్క శెట్టి ఘాటి మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. సౌత్ ఇండియాలో ఏ వుమెన్ సెంట్రిక్ సినిమాకు గతంలో ఇంత రేటు లభించకపోవడం గమనార్హం.
చాలా కాలంగా పెద్దగా సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఘాటికి దక్కిన ఓటీటీధర చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఘాటి మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుందని కూడా ఆ రిపోర్టు తెలిపింది.
ఘాటి మూవీ గురించి..
'ఘాటి'లో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'వేదం', 'హరి హర వీర మల్లు' చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించాడు. ఈ సినిమాను ఏకంగా రూ.45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇప్పుడు డిజిటల్ హక్కుల ద్వారా రూ.36 కోట్లు తిరిగి రావడంతో బడ్జెట్ లో పెద్ద మొత్తం రికవర్ అయినట్లే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.12 కోట్లుగా ఉంది. మూవీకి ఏమాత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. ఈ మొత్తాన్ని సులువుగా వసూలు చేస్తుంది.
'ఘాటి'లో అనుష్క శెట్టి పాత్ర
చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. ఆమె చివరి మూవీ 'మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి' బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అనుష్క 40 ఏళ్ల మహిళగా, సరోగసీని ఎంచుకుని పెద్ద సమస్యల్లో చిక్కుకునే బోల్డ్ పాత్రను పోషించింది.
'ఘాటి'లో ఆమె గ్రామీణ యువతిగా కనిపిస్తోంది. అంతేకాదు ఆమె కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించినట్లు తెలుస్తోంది. క్రిష్ ఇప్పటికే 'వేదం'లో అనుష్కను డైరెక్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మూవీని కూడా క్రిష్ డైరెక్ట్ చేశాడు. అయితే కొంతభాగం పూర్తయిన తర్వాత అతను తప్పుకున్నాడు. ఆ వెంటనే అనుష్కతో ఘాటి మొదలుపెట్టాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



