ఓటీటీలోకి నిన్న రిలీజైన 3 సినిమాలు- ఒకేదాంట్లో అనుష్క ఘాటి, శివ కార్తికేయన్ మదరాసి-లిటిల్ హార్ట్స్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న (సెప్టెంబర్ 5) థియేట్రికల్ రిలీజ్ అయిన మూడు సినిమాల డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి నెలకొంది. వాటిలో అనుష్క శెట్టి ఘాటి, శివ కార్తికేయన్ మదరాసి ఒకేదాంట్లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి మౌళి తనూజ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ లిటిల్ హార్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
థియేట్రికల్ రిలీజ్ అనంతం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి టాక్ రావడం సర్వసాధారణంగా మారిన విషయం అని తెలిసిందే. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన కొత్త సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డీటేల్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరి ఆ లేటెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఘాటి ఓటీటీ
ఈ వారం థియేట్రికల్ రిలీజ్‌లో ముందుగా చెప్పుకునేది ఘాటి. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘాటికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో అనుష్క శెట్టి నటించింది.
సెప్టెంబర్ 5న అంటే నిన్న థియేటర్లలో విడుదలైన ఘాటి సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, అనుష్క శెట్టి చేసిన యాక్షన్ సీక్వెన్స్, యాక్టింగ్‌కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో ఘాటి ఓటీటీ స్ట్రీమింగ్ప్లాట్‌ఫామ్‌పై బజ్ క్రియేట్ అయింది.
అమెజాన్ ప్రైమ్‌లో ఘాటి ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. థియేట్రికల్ రన్నింగ్ ముగిసిన తర్వాత ప్రైమ్ వీడియోలో ఘాటి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, కలెక్షన్స్, టాక్‌ను బట్టి ఘాటి ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుంది.
మదరాసి ఓటీటీ
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన శివ కార్తికేయన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమానే మదరాసి. ఈ మూవీకి డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా విద్యుత్ జమాల్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించిన మదరాసి కూడా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది.
తెలుగులో కూడా విడుదలైన మదరాసి ఓటీటీ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు నాలుగు వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్లో మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
లిటిల్ హార్ట్స్ ఓటీటీ
అనుష్క ఘాటి తర్వాత బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన ఒరిజినల్ తెలుగు సినిమా లిటిల్ హార్ట్స్. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న మౌళి తేజ్ హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన సినిమానే లిటిల్ హార్ట్స్. ఇందులో హీరోయిన్‌గా బ్యూటిఫుల్శివాని నాగరం చేసింది.
రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ కూడా నిన్న (సెప్టెంబర్ 5) థియేటర్లలో విడుదలైంది. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసకున్న లిటిల్ హార్ట్స్ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే, లిటిల్ హార్ట్స్ సినిమాను ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ తన ప్రొడక్షన్ నుంచి ఒరిజినల్ చిత్రంగా నిర్మించింది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
కాబట్టి, లిటిల్ హార్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ అని స్పష్టంగా తెలిసిపోతుంది. థియేట్రికల్ రన్ తర్వాత లిటిల్ హార్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఘాటి, మదరాసి అమెజాన్ ప్రైమ్‌లో.. లిటిల్ హార్ట్స్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



