Ashu Reddy: అషు రెడ్డి బెదిరించింది.. అందుకే కేసు పెట్టాను.. ఏడాదిగా సాగుతోంది.. ఇల్లు, డబ్బు తిరిగివ్వమన్నా: ధర్మేంద్ర
Ashu Reddy: నటి అషు రెడ్డి తనను మానసికంగా వేధించడమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని బాధితుడు ధర్మేంద్ర ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని, దీనిపై పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని ఆయన స్పష్టం చేశారు.
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషు రెడ్డి చుట్టూ వివాదాల ముసురు పెరుగుతోంది. తనను పెళ్లి పేరుతో నమ్మించి, కోట్లాది రూపాయల ఆస్తులు, నగదు తీసుకుని ఇప్పుడు బెదిరింపులకు దిగుతోందంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ధర్మేంద్ర మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లి పేరుతో రెండేళ్ల మోసం
గత రెండేళ్లుగా అషు రెడ్డితో తనకు పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతోనే ఆమె అడిగినవన్నీ సమకూర్చానని ధర్మేంద్ర తెలిపారు. ఏడాదిగా ఇదంతా సాగుతోందని, ఇప్పుడెలా బయటకు వచ్చిందో తెలియని అన్నారు.
"అషు రెడ్డి కోసం బంగారం కొన్నాను. ఆమె కోరిక మేరకు ఇల్లు కూడా కొనిపించాను. కానీ తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆమె మాట మార్చింది. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. సరే పెళ్లి చేసుకోనప్పుడు నేను పెట్టిన ఖర్చు, కొనిచ్చిన ఆస్తులు తిరిగి ఇచ్చేయమని అడిగితే అసలు రంగు బయటపెట్టింది" అని బాధితుడు ధర్మేంద్ర ఆ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి మరీ ఇచ్చాను
కేవలం తన దగ్గర ఉన్న సొమ్ము మాత్రమే కాకుండా అషు రెడ్డి అవసరాల కోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు. తన తండ్రితో కలిసి బయట వ్యక్తుల దగ్గర కూడా అప్పులు చేసి ఆమెకు డబ్బులు ఇచ్చామన్నారు.
"ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి అడిగితే నన్ను, మా నాన్నను భయపెట్టడం మొదలుపెట్టింది. వేధింపులు మితిమీరిపోవడంతోనే మా నాన్న పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. మేము చట్టబద్ధంగానే పోరాటం చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
పోలీసుల వద్ద పక్కా ఆధారాలు
ఈ వ్యవహారంలో పోలీసులు రెండు, మూడు నెలలపాటు ప్రాథమిక విచారణ జరిపి, ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారని ధర్మేంద్ర గుర్తు చేశారు. పోలీసులకు సమర్పించిన ఆధారాల్లో ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ చాట్స్ ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ వివాదాన్ని బయట సెటిల్ చేసుకునేందుకు అషు రెడ్డి మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించిందని, కానీ తాము న్యాయం కోసమే నిలబడ్డామని ఆయన స్పష్టం చేశారు. అషు రెడ్డి అతనికి పంపిన ఆడియో క్లిప్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
అందులో తనకు మే వరకు టైమ్ ఇస్తే రూ.కోటిన్నర సెటిల్ చేస్తానని, మిగిలినవి తర్వాత ఇస్తానని, కాదంటే వేధిస్తున్నావని కేసు పెడతానని అషు రెడ్డి వార్నింగ్ ఇవ్వడం వినొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. అషు రెడ్డిపై ధర్మేంద్ర తండ్రి ఎందుకు కేసు పెట్టారు?
పెళ్లి పేరుతో తమ దగ్గర భారీగా నగదు, బంగారం, ఆస్తులు వసూలు చేసి, తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతోందన్న ఆరోపణలతో ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2. బాధితుడు ధర్మేంద్ర ప్రధాన ఆరోపణలు ఏమిటి?
అషు రెడ్డి తనను మానసికంగా వేధించిందని, తన దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా బ్యాంకు లోన్లు కూడా తీయించిందని, ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకుండా బెదిరిస్తోందని ధర్మేంద్ర ఆరోపించారు.
3. అషు రెడ్డి కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ధర్మేంద్ర కుటుంబం ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన తర్వాత పోలీసులు అషు రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


