Awarapan 2 box office: కేవలం 9 గంటల్లోనే మూవీ ఫస్ట్ పార్ట్ లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసిన ఆవారాపన్ 2
Awarapan 2 box office: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటించిన ఆవారాపన్ 2 తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. 19 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డును కేవలం 9 గంటల్లోనే బ్రేక్ చేయడం విశేషం.
Awarapan 2 box office: ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ స్టార్ట్ అయింది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఊహించని రేంజ్‌లో 'ఆవారాపన్ 2' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన కేవలం 9 గంటల్లోనే పార్ట్ 1 సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను తిరగరాసి బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

కేవలం 9 గంటల్లోనే పార్ట్ 1 రికార్డులు అవుట్
2007లో వచ్చిన మొదటి భాగం 'ఆవారాపన్' థియేటర్లలో ప్లాప్‌గా నిలిచి, తన పూర్తి రన్‌లో కేవలం రూ. 7.76 కోట్లు మాత్రమే రాబట్టింది. నాటి సినిమా మొదటి రోజు కేవలం రూ. 79 లక్షలు, ఫస్ట్ వీకెండ్‌లో రూ. 2.88 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
కానీ ఇప్పుడు వచ్చిన సీక్వెల్ 'ఆవారాపన్ 2' సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజు సాయంత్రం 6 గంటల సమయానికే రూ. 12.05 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. అంటే మొదటి భాగం లైఫ్‌టైమ్ వసూళ్లను దాటడానికి ఈ సీక్వెల్‌కు కేవలం 8 నుంచి 9 గంటల సమయం మాత్రమే పట్టింది.
ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో ఈ సినిమాకు సంబంధించి ప్రతి గంటకు 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. శుక్రవారం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ. 20 కోట్ల మైలురాయిని సులువుగా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లో 'రాజ్ 2' (రూ. 10.35 కోట్లు), 'బాద్‌షాహో' (రూ. 12.60 కోట్లు) మాత్రమే డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ సాధించాయి. ఇప్పుడు 'ఆవారాపన్ 2' ఆ రెండు చిత్రాల రికార్డులను పటాపంచలు చేస్తూ అతని కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సన్నీ డియోల్ 'బట్వారా 1947' క్లాష్‌ను తట్టుకుని రాంపేజ్
ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద సన్నీ డియోల్ నటించిన బిగ్ మూవీ 'బట్వారా 1947'తో పోటీ పడినప్పటికీ, 'ఆవారాపన్ 2' కలెక్షన్లపై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు. 2026 బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్లలో ఒకటిగా నిలిచేందుకు ఈ చిత్రం రేసులో ముందు వరుసలో ఉంది.
మాస్ ఆడియన్స్‌తో పాటు యూత్‌లో ఉన్న విపరీతమైన క్రేజ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. శివం పండిట్ అనే పవర్‌ఫుల్ ఐకానిక్ క్యారెక్టర్‌లో ఇమ్రాన్ హష్మీ చూపించిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతోంది.
ఆవారాపన్ 2 మూవీ విశేషాలు
నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌ను విశేష్ భట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటానీ నటించగా.. షబానా అజ్మీ, సువిందర్ విక్కీ అత్యంత కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.
సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌కు ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


