ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్- శృంగార, యాక్షన్ సీన్స్‌తోనే స్టోరీ- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి రీసెంట్‌గా సరికొత్త బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్ బ్యాడాస్ బేగమ్. ఈ సిరీస్ 17 హత్యలు చేసిన ఓ లేడి కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. మోతాదుకు మించి శృంగార, యాక్షన్ సీన్స్ ఉన్న బ్యాడాస్ బేగమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి బ్యాడాస్ బేగమ్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో లుక్కేద్దాం.
ఓటీటీలోకి విచిత్రమైన కంటెంట్‌తో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అరంగేట్రం చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్‌తోపాటు రొటీన్ స్టోరీస్ అయిన డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీల్లో దింపుతుంటారు మేకర్స్. వాటిలో ఎన్నో రకాల జోనర్స్ ఉంటాయి.

ఓటీటీలోకి నయా బోల్డ్ సిరీస్
అయితే, ఇటీవల కాలంలో ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా పలు ఎలిమెంట్స్‌తో క్రైమ్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఓటీటీలోకి నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే బ్యాడాస్ బేగమ్. ఐశ్వర్య రాజే అనేది క్యాప్షన్. అంటే, ఊర్వశి రాజే అనే యువతి చుట్టూ బ్యాడాస్ బేగమ్ సిరీస్ కథ సాగుతుంది.
ముంబై సిటీలోకి ఊర్వశి రాజే అనే యువతి వస్తుంది. తనకు ఖరీదైన జీవితం గడపాలని ఉంటుంది. పెద్ద పెద్ద బంగ్లాలు, హోటల్స్‌లో జీవించాలనుకుంటుంది. అందుకోసం ముందుగా షార్ట్‌కట్‌లో హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ, తన బాయ్‌ఫ్రెండ్ గ్యాంగ్‌స్టర్ కావడంతో గూండాగా మారి డబ్బులు సంపాదించాలనుకుంటుంది ఊర్వశి.
కథ మలుపు తిరిగేది
ఈ క్రమంలో ముంబైకి పెద్ద డాన్ అయిన లాలా దగ్గరికి ఊర్వశి రాజేను తీసుకెళ్తాడు తన బాయ్‌ఫ్రెండ్. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా గడిపిన ఊర్వశి లాలాతో శృంగారం చేస్తుంది. కట్ చేస్తే లాలాతో యుద్ధానికి దిగుతుంది ఊర్వశి. ఈ క్రమంలో కొంతమంది గ్యాంగ్‌స్టర్స్‌ను కూడా చంపి లేడి కిల్లర్‌గా మారుతుంది ఊర్వశి.
అలా మొత్తంగా 17 మందిని లేడి కిల్లర్ ఊర్వశి హత్య చేస్తుంది. అసలు లాలాతో ఊర్వశికి శత్రుత్వం ఎందుకు వచ్చింది? అసలు ఊర్వశి రాజే ఎవరు? ఆమెను బ్యాడాస్ బేగమ్ అని పిలవడానికి కారణం ఏంటీ? అనే ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్ విషయాలు తెలియాలంటే బ్యాడాస్ బేగమ్ ఓటీటీ సిరీస్ను చూడాల్సిందే.
శృంగార-యాక్షన్ సీన్స్
బ్యాడాస్ బేగమ్ ఒక హిందీ వెబ్ సిరీస్. ఇది ఒక బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా జోనర్. ఇందులో అయితే, శృంగార సీన్స్, లేదా యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ శృంగార, యాక్షన్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాలతో తెరకెక్కిన బ్యాడాస్ బేగమ్ హంగామా ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్. అయితే, హంగామాతోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా బ్యాడాస్ బేగమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
రెండు రోజుల క్రితం
జూన్ 26న అంటే రెండు రోజుల క్రితం కేవలం హిందీ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో హంగామా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లలో బ్యాడాస్ బేగమ్ ఓటీటీ రిలీజ్ అయింది. బోల్డ్, క్రైమ్, యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారు ఈ బ్యాడాస్ బేగమ్‌ను ఎంచక్కా చూసేయొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



