ఈ వారం ఓటీటీ టాప్ 7 సినిమాలు ఇవే.. అన్ని తెలుగులోనే.. ఒక్కోటి ఒక్కో రకం.. వీకెండ్‌కు బెస్ట్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఈ వారం అనేక సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ది బెస్ట్ సినిమాలుగా ఏడు ఉన్నాయి. అవి కూడా అన్ని తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని విభిన్నమైన జోనర్స్‌లలో ఉన్న ఈ ఓటీటీ రిలీజ్ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీలో ఈ వారం సుమారుగా 27కిపైగా సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో ఏడు సినిమాలు మాత్రం చూసేందుకు ది బెస్ట్‌గా ఉన్నాయి. అది కూడా తెలుగు భాషలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కో రకమైన జోనర్లలో వీకెండ్‌కు ది బెస్ట్ అనిపించే ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ
వరల్డ్ వైడ్‌గా ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సూపర్ హీరో మూవీ ఫ్రాంచైజీ మార్వెల్ నుంచి ఈ ఏడాది వచ్చిన కొత్త సినిమా కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్. అమెరికా అధ్యక్షుడే రాక్షసుడిలా మారితే సూపర్ హీరో ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లోని ఈ సినిమా మే 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్‌స్టార్‌లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హిట్ 3 ఓటీటీ
నేచురల్ స్టార్ నానినటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ మూడో సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇప్పుడు మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచి హిట్ 3 ఓటీటీ ట్రెండింగ్ టాప్ 1లో దూసుకుపోతోంది.
క్రిమినల్ జస్టీస్ సీజన్ 4 ఓటీటీ
బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్‌ల్లో క్రిమినల్ జస్టీస్ ఒకటి. లీగల్ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కే ఈ సిరీస్‌లో నాలుగో సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో క్రిమినల్ జస్టీస్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ అయింది. మే 29 నుంచి హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠి భాషల్లో క్రిమినల్ జస్టీస్ 4 ఓటీటీ స్ట్రీమింగ్అవుతోంది.
డిపార్ట్‌మెంట్ క్యూ ఓటీటీ
హాలీవుడ్ నుంచి డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిపార్ట్‌మెంట్ క్యూ. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్, 83 శాతం రొట్టెన్ టొమాటోస్ నుంచి ఫ్రెష్ కంటెంట్ అనిపించుకున్న డిపార్ట్‌మెంట్ క్యూ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. మే 29 నుంచి తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
తుడరుమ్ ఓటీటీ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ శోభన జోడీగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం తుడరుమ్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన తుడరుమ్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. మే 30 నుంచి మలయాళం, తెలుగు, హిందీ సహా సౌత్ భాషల్లో తుడరుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
లాస్ట్ బ్రీత్ ఓటీటీ
సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా లాస్ట్ బ్రీత్. ఐఎమ్‌డీబీలో 7.6 రేటింగ్ దక్కించుకున్న లాస్ట్ బ్రీత్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో మే 30న లాస్ట్ బ్రీత్ ఓటీటీ రిలీజ్ అయింది.
రెట్రో ఓటీటీ
తమిళ స్టార్ హీరో సూర్య, బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడీ కట్టిన గ్యాంగ్‌స్టర్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో నెట్ఫ్లిక్స్లో మే 30 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రెట్రో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



