OTT Horror: ఓటీటీలో నిద్ర లేకుండా చేసే 4 బెస్ట్ హారర్ థ్రిల్లర్స్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో భయపెడుతున్న సినిమాలు!

OTT Horror: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వారం వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మైండ్ బెండింగ్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఊహించని మలుపులు, పీక్ లెవెల్ సస్పెన్స్‌తో భయపెడుతున్న ఈ టాప్ 4 సినిమాలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 12, 2026, 21:47:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror: వారమంతా బిజీ లైఫ్, ఆఫీస్ ఒత్తిడితో గడిపే డిజిటల్ ప్రేక్షకులకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో సరికొత్త సినిమాల కోసం వెతుకులాట మొదలవుతుంది. రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ డ్రామాలతో బోర్ కొట్టిన వారికి హారర్ థ్రిల్లర్ జానర్ ఇచ్చే కిక్కే వేరు. ఈ వారం ఓటీటీలోకి ఈ 4 హారర్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో నిద్ర లేకుండా చేసే 4 బెస్ట్ హారర్ థ్రిల్లర్స్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో భయపెడుతున్న సినిమాలు!
ఓటీటీలో నిద్ర లేకుండా చేసే 4 బెస్ట్ హారర్ థ్రిల్లర్స్.. మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులతో భయపెడుతున్న సినిమాలు!

1. త్రికాల (Trikala)

సౌత్ ఇండియన్ సినీ ప్రియులు మెచ్చే పక్కా మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తాంత్రిక శక్తులు, హారర్ అంశాల నేపథ్యంతో తెరకెక్కిన ఒక మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ త్రికాల. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఎందుకు చూడాలి?

రొటీన్ దెయ్యం సినిమాల్లా జంప్-స్కేర్స్‌పైనే కాకుండా.. కర్మ సిద్ధాంతం అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల ట్విస్ట్ సినిమాకే మైండ్ బ్లోయింగ్ హైలైట్ అని చెప్పాలి.

ఓటీటీ: సన్ నెక్స్ట్ (SunNXT), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియోహాట్ స్టార్ (Jiohotstar)

2. శిఖండి (Shikhandi)

కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన ఈ మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను, నేటి కాలపు క్రైమ్ సస్పెన్స్‌కు ముడిపెడుతూ ఈ కథను తెరకెక్కించారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే ఈ సినిమా సొంతం.

ఎందుకు చూడాలి?

మహాభారతంలోని శిఖండి పాత్ర స్ఫూర్తితో పారానార్మల్ హారర్, రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం శిఖండి. ఒక పురాతన ఆలయంలో వచ్చే ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేస్తాయి.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

3. డుగ్‌డుగ్ (DugDug)

ఇదొక విభిన్నమైన సైకలాజికల్ హారర్ డ్రామా. సాధారణ హారర్ జానర్‌కు భిన్నంగా సమాజంలో మనుషుల నమ్మకాలు, మూఢనమ్మకాల వెనుక ఉండే అసలు రహస్యాలు ఏంటి అనే అంశాన్ని కాస్త వ్యంగ్యంగా, అంతే భయపెట్టే విజువల్స్‌తో ఇందులో చూపించారు. బాలీవుడ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ కాకూడని ట్రేడ్ మార్క్ చిత్రమిది.

ఎందుకు చూడాలి?

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ "బుల్లెట్ బాబా" (ఓం బన్నా) నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక బాలీవుడ్ సెటైరికల్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఇది. యాక్సిడెంట్ జరిగిన చోటుకు ఓ బైక్ తిరిగి ఎలా వెళ్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

4. బ్యాక్‌రూమ్స్ (Backrooms)

హాలీవుడ్ స్థాయి ఇంటెన్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి 'బ్యాక్‌రూమ్స్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక అంతం లేని భయంకరమైన పసుపు రంగు గదుల భవనంలో చిక్కుకుపోయిన వ్యక్తులు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, ఆ క్రమంలో వారు ఫేస్ చేసిన శక్తులు ఏంటి అనేది ఒళ్లు గగుర్పొడిచేలా చూపిస్తుంది.

ఎందుకు చూడాలి?

బేస్ మెంట్ లో ఉండే ఓ డోర్ ద్వారా వెళ్తే అంతులేని మిస్టరీతో కూడిన బిల్డింగ్ ఉండటమే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్. అందులోని భయంకర శక్తులు ఇంకా వణుకు పుట్టిస్తాయి.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో (రెంట్)

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More