ఓటీటీలోకి ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్- 7.1 నుంచి 5కి పడిపోయిన రేటింగ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ముగ్గురు హీరోల తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం వచ్చేయనుంది. తాజాగా భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు నటించిన మల్టీస్టారర్ మూవీ భైరవం ఓటీటీ రిలీజ్‌పై ఇక్కడ తెలుసుకుందాం.
టాలీవుడ్‌లోని ముగ్గురు హీరోలు కలిసిన నటించిన సినిమా భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన విషయం తెలిసిందే.

ముగ్గురు హీరోలతో
విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చిన విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భైరవం సినిమాను భారీగా నిర్మించారు. భైరవం సినిమాలో ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రలు పోషించారు.
వీరితోపాటు భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమా వరల్డ్ వైడ్‌గా మే 30న థియేటర్లలో విడుదలైంది. అయితే, భైరవం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్‌లో కాస్తా కొత్తదనం కనిపించిందన్నారు.
యాక్టింగ్‌పై ప్రశంసలు
అలాగే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ బాగుందని, మంచు మనోజ్ను కొత్తగా చూస్తారని, నారా రోహిత్ ఎప్పుడ లేనంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ప్రశంసలు వచ్చాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత భైరవం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.1 రేటింగ్ ఉండేది. కానీ, ఇప్పుడు అది 5కి పడిపోయింది.
5కి పడిపోయిన రేటింగ్
అంటే, ప్రస్తుతం భైరవం సినిమాకు ఐఎమ్డీబీలో 10కి 5 రేటింగ్ ఉంది. ఇక తాజాగా భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. జీ5లో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. భైరవం ఓటీటీ రిలీజ్‌పై కమింగ్ సూన్ అంటూజీ5 సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
ఇదే నెల జూలైలో భైరవం ఓటీటీ రిలీజ్ కానుంది. జూలై రెండో వారంలో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, ఇవాళ, లేదా రేపు భైరవం ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా జీ5 ప్లాట్‌ఫామ్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
భైరవం కథ
ఇక భైరవం కథలోకి వెళితే.. శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), గజపతి వర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఊరిలో వారాహి అమ్మవారి గుడికి చెందిన భూములను మంత్రి (శరత్ లోహితాస్య) కాజేయాలని ప్రయత్నిస్తాడు.
కానీ, దానికి అడ్డంగా ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. ఆ గుడికి ధర్మకర్తగా ఉన్న గజపతి నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) అకస్మాత్తుగా మరణిస్తుంది. దీంతో గజపతి దగ్గర పనిచేసే శీను గుడికి ధర్మకర్త అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే భైరవం కథ.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













