బ‌యోపిక్ మూవీకి డైరెక్ట‌ర్‌గా బిగ్‌బాస్ ఆదిత్య ఓం - రిలీజ్ డేట్ ఇదే!

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 కంటెస్టెంట్ ఆదిత్యం ఓ ద‌ర్శ‌కుడిగా మారాడు. ఓ బ‌యోపిక్ మూవీని రూపొందించాడు. సంత్ తుకారం పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు సుభోద్ భావే టైటిల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Jul 16, 2025, 11:44:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు ఆదిత్య ఓం. టాప్ కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ వ‌ర‌కు వ‌స్తాడ‌ని బిగ్‌బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 32వ రోజే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ త‌ర్వాత తిరిగి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టిన ఆదిత్య ఓం ప్ర‌యోగాల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తున్నాడు.

సంత్ తుకారం మూవీ
సంత్ తుకారం మూవీ

తాజాగా ఆదిత్య ఓం ద‌ర్శ‌కుడిగా మారి ఓ బయోపిక్ మూవీని రూపొందించారు. ‘సంత్ తుకారం’ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ జూలై 18న రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీ, మ‌రాఠీతో పాటు ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

మ‌రాఠీ క‌వి...

17వ శతాబ్దపు మరాఠీ సాధువు-కవి సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం ఓ సినిమాను రూపొందించాడు. సంత్ తుకారం మూవీలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. సంత్ తుకారం పాత్ర‌లో సుబోధ్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. సుభోద్ భావే మ‌ల‌యాళంలో టాప్ యాక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు. హిందీతో పాటు మలయాళంలో కొన్ని సినిమాలు చేశాడు.

ముఖేష్ ఖ‌న్నా వాయిస్ ఓవ‌ర్‌..

సంత్ తుకారం మూవీలో సుభోద్ భావోతో పాటు శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. దిగ్గ‌జ బాలీవుడ్ న‌టుడు ముఖేష్ ఖన్నాఈ సినిమాకు వాయిస్ ఓవర్ను అందించారు.

లాహిరి లాహిరి లాహిరిలో...

సంత్ తుకారం మూవీకి నిఖిల్ కామత్, రవి త్రిపాఠి, వీరల్, లావన్ మ్యూజిక్ అందించారు. శాస్త్రీయ, జానపద, భక్తి భావాల్ని కలిగించేలా ఈ పాట‌లు ఉంటాయ‌ని మేక‌ర్స్ అంటున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్య ఓం.

ఆ త‌ర్వాత ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యూ, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, మా అన్న‌య్య బంగారంతో పాటు తెలుగులో 30 వ‌ర‌కు సినిమాల్లో హీరోగానే కాకుండా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశాడు. బాలీవుడ్‌లో కొన్ని చిన్న సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More