బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ డెబ్యూ మూవీకి టైటిల్ ఫిక్స్ - హీరోయిన్‌గా సురేఖ‌వాణి కూతురు

బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్ డెబ్యూ మూవీకి టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి చౌద‌రిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో న‌టి సురేఖ‌వాణి కూతురు సుప్రిత‌నాయుడు హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Published on: Jun 4, 2025, 09:08:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్‌బాస్ ఫేమ్ అమ‌ర్‌దీప్ చౌద‌రి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. అత‌డు డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్స‌య్యింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి చౌద‌రిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమ‌ర్‌దీప్ చౌద‌రికి జోడీగా సురేఖ వాణి కూతురు సుప్రిత నాయుడు హీరోయిన్‌గా న‌టిస్తోంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సురేఖ‌వాణి, వినోద్‌కుమార్‌, రాశి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్
బిగ్‌బాస్ అమ‌ర్‌దీప్

లిమిటెడ్ బ‌డ్జెట్‌లో...

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "చౌద‌రిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమాను లిమిటెడ్ బడ్జెట్ తో ప్రారంభించాం, కానీ హీరోహీరోయిన్ల‌కు ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. షూటింగ్ అంత పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని తెలిపారు.

భయం వేసింది....

హీరోయిన్ సుప్రిత‌నాయుడు మాట్లాడుతూ షూటింగ్ మొద‌ల‌య్యే టైమ్‌లో కెమెరా ముందు ఎలా న‌టించాలోన‌నే భయం వేసింది కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. షూటింగ్ లో అమ‌ర్‌దీప్ చాలా సపోర్ట్ చేశారు అని తెలిపింది. టైటిల్ చాలా బాగుంద‌ని, సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని సురేఖ‌వాణి తెలిపింది.

మొద‌టి సినిమాకే...

హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ "నా మొదటి సినిమాకే మంచి టైటిల్ కుద‌ర‌డం ఆనందంగా ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అభిమానులు అడుగుతున్నారు, చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు రావాలని అనుకున్నాను. అన్ని కుదరడానికి ఇంత సమయం పట్టింది. "చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి" మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.

ర‌న్న‌ర‌ప్‌గా…

చౌద‌రిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయితో పాటు మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు అమ‌ర్‌దీప్ చౌద‌రి. బిగ్బాస్ తెలుగు సీజ‌న్ 7లో ఫైన‌ల్ చేరుకున్నాడు అమ‌ర్‌దీప్‌. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. మ‌రోవైపు సుప్రిత‌నాయుడు లేచింది మ‌హిళా లోకంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More